Site icon NTV Telugu

Movie Tickets Rates : తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఛాన్స్..?

Tollywood

Tollywood

Movie Tickets Rates : తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల విషయంలో ఎప్పటినుంచో చాలా అనుమానాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపునకు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలకు మాత్రం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇంకొన్ని సినిమాలకు బెనిఫిట్ షోలు కూడా వేసుకునేలా జీవో ఇచ్చారు. మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు జీవో ఇచ్చారు. కానీ హైకోర్టుకు వెళ్లి పిటిషన్ వేయడంతో దాన్ని క్యాన్సల్ చేశారు. టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఇచ్చిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. దాంతో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇకనుంచి తెలంగాణలో ఏ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచబోమన్నారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో ఇకనుంచి తెలంగాణలో సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే వీలు ఉంటుందా అనే ప్రచారం జరుగుతుంది.

Read Also : Samantha : సమంత సినిమాలో విలన్ గా క్రేజీ యాక్టర్..

తాజాగా సినీ కార్మికుల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటే నిర్మాతలకు, హీరోలకు లాభం జరుగుతుంది కానీ.. కార్మికులకు ఎలాంటి లాభం లేదన్నారు. ఇకనుంచి తెలంగాణలో రేట్లు రేట్లు పెంచే సినిమా టికెట్లలో 20% వాటాను కార్మికులకు ఇచ్చేలా జీవు తీసుకువస్తామన్నారు. ఒకవేళ అలా వాటా ఇవ్వని సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేలా పర్మిషన్ ఇచ్చేది లేదన్నారు. అంటే తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి.. ఒక ప్రకటన చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో సినిమాలకు రేట్లు పెంచుకునేలా పర్మిషన్ ఇస్తుండొచ్చు. ఇది ఒక రకంగా భారీ బడ్జెట్ సినిమాలకు కలిసివచ్చే అంశమే. కాకపోతే కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వడానికి సినీ నిర్మాతలు ఒప్పుకుంటారా లేదా అనేది ఇక్కడ మరో అంశం. ఇప్పటికే సినీ కార్మికుల వేతనాలు పెంచడానికి నిర్మాతలు చాలా అడ్డంకులు చెప్పారు. ఎన్నో పోరాటాల తర్వాత కొద్ది మేర పెంచేందుకు అది కూడా కండిషన్ల మీద ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు 20 శాతం మాట అంటే మామూలు విషయం కాదు. మరి దీనిపై ఎన్ని రకాల అభ్యంతరాలు వస్తాయో చూడాలి.

Read Also : Khaidi : చిరంజీవి ఖైదీకి 42 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న హీరో అతనే

Exit mobile version