Telangana High Court Verdict on Vyuham Movie: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిందన్న సంగతి తెలిసిందే. వ్యూహం సినిమా పై ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈనెల 9 లోగా నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డ్ కు ఆదేషాలు జారీ చేసింది. ఈ కేసులో సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు వాదనలు కొనసాగాయి. వ్యూహం సినిమా ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నాయకులను కించపరిచే విధంగా నిర్మించారని ఆరోపిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు పలువురు రెండు నెలల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సింగిల్ జడ్జి ‘వ్యూహం’ సినిమాకు సెన్సారు బోర్డు (సీబీఎఫ్‌సీ) ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేస్తూ జనవరి 22న తీర్పు ఇచ్చింది.
Ambajipeta Marriage Band: ‘రంగస్థలం’కి ‘అంబాజీపేట’కి పోలికలు.. నిర్మాత ఏమన్నాడంటే?
ఈ తీర్పుపై నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, దర్శకుడు రాంగోపాల్‌వర్మ, రామదూత క్రియేషన్స్ హైకోర్టులో అప్పీలు చేసుకోగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కోర్టు సమయం ముగిసిపోవడంతో ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. గురువారం ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది . కోర్టులో వాదనలు, ప్రతివాదనలు జరిగిన తరువాత గురువారం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే సెన్సారు బోర్డు అన్నింటిని పరిగణనలోకి తీసుకోలేనందున సినిమాను విడుదల చేయవద్దని టీడీపీ నాయకులు పిటిషన్‌లో కోరారు. అయితే సర్టిఫికెట్ జారీచేసే ముందు ప్రతి సినిమాకూ రివైజింగ్ కమిటీ కారణాలు పేర్కొనాల్సిన అవసరం లేదని ‘వ్యూహం’ నిర్మాతలు హైకోర్టులో వాదించారు.