NTV Telugu Site icon

Diljit Dosanjh : హైదరాబాదులో దిల్జిత్ కాన్సర్ట్.. తెలంగాణ సర్కార్ షాక్?

Diljit

Diljit

ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోశాంజ్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆయన లైవ్ షోలు, వాటికి సంబంధించి జరుగుతున్న వివాదాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నవంబర్ 15న హైదరాబాద్‌లో దిల్జిత్ కాన్సర్ట్ జరగనుంది. ఈ మేరకు ఈవెంట్ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు పంపింది. నోటీసుల ప్రకారం పిల్లలను వేదికపైకి తీసుకెళ్లకూడదని కోరారు. WHO మార్గదర్శకాల ప్రకారం లైవ్ షో సమయంలో లౌడ్ మ్యూజిక్ ఉంటుంది, ఫ్లాష్ లైట్లు ఉంటాయి కాబట్టి వారిని స్టేజ్ ఎక్కించవద్దని కోరారు. అలాగే మద్యం, మాదక ద్రవ్యాలు, హింసను ప్రోత్సహించేటువంటి పాటలను వేదికపై పాడకూడదని హెచ్చరించారు. WHO మార్గదర్శకాల ప్రకారం, పెద్దలు 140 dB కంటే ఎక్కువ ధ్వని ఒత్తిడికి గురికాకూడదు. అలాగే పిల్లలు 120 dBకి మించి గురికాకూడదు. లైవ్ షోల సమయంలో వేదికపై ధ్వని స్థాయి 120 dB కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలను వేదికపైకి తీసుకెళ్లకూడదు.

Shyam Sundara Kulkarni: ప్రముఖ లిరిసిస్ట్ మృతి.. ఇండస్ట్రీలో విషాదం

అలాగే నోటీసులో, దిల్జిత్ పాత కచేరీలలో మద్యం మరియు మాదకద్రవ్యాలను ప్రోత్సహించే పాటలు పాడిన వీడియోలకు ఆధారాలుగా ఇచ్చి వాటిని రిపీట్ చేయవద్దని హెచ్చరించారు. ఇక ఢిల్లీలోని జవహర్‌లాల్ స్టేడియంలో జరిగిన దిల్-లుమ్నాటి సంగీత కచేరీలో పాటియాలా పెగ్, పంజ్ తారలా వంటి పాటలు దిల్జిత్ పాడారు. నిజానికి గత కొన్ని నెలలుగా దిల్జిత్ కచేరీకి సంబంధించి తీవ్ర వివాదం నడుస్తోంది. దిల్జిత్ లైవ్ షో అక్టోబర్ 26-27 తేదీల్లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగింది. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత స్టేడియంలో అపరిశుభ్రత వ్యాపించడం అందరినీ కలిచివేసింది. అక్కడ చెత్త కుప్ప చూసి షాక్ అయ్యారు. మద్యం, వాటర్ బాటిళ్లను అక్కడక్కడ విసిరేశారు. రన్నింగ్‌ ట్రాక్‌పై కుళ్లిపోయిన ఆహారం, కుర్చీలు విరిగిపోయి కనిపించాయి. ఇక ఆ చెత్త కారణంగా, ఆటగాళ్ళు తమ ప్రాక్టీస్‌ను ఆపేయాల్సి వచ్చింది.