Site icon NTV Telugu

Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

radhe shyam

radhe shyam

రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ ఈనెల 11న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. సాహో సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల విరామం అనంతరం ప్రభాస్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను కూడా పాన్ ఇండియాగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ మూవీ ఐదో ఆటకు అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.

మార్చి 11 నుంచి మార్చి 25వ తేదీ వరకు రాధేశ్యామ్ సినిమాకు ఐదో షో ప్రదర్శించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యువీ క్రియేషన్స్ అధినేతలు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. వింటేజ్ ప్రేమ కథగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు.

Exit mobile version