NTV Telugu Site icon

Ram Charan: బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం.. చరణ్ ట్వీట్ వైరల్

Charan

Charan

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న చరణ్.. ఇండియా గర్వించే విధంగా ఎన్నో అవార్డులను, రివార్డులను అందుకోవడం కాకుండా.. మరెన్నో అరుదైన అవకాశాలను అందుకున్నాడు. ఇక చరణ్.. తెలంగాణ ఉత్సవాల్లో కూడా చురుక్కుగా పాల్గొంటాడు. తాజాగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న విషయం తెల్సిందే. తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లు పూర్తిచేసుకొని పదవ వసంతంలోకి అడుగుపడుతుంది. నేటినుంచి 21 రోజులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెల్సిందే. ఒక్క కేసీఆర్ మాత్రమే కాకుండా బీజేపీ, కాంగ్రెస్ సైతం తమకు తగ్గట్టు ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇక ఉదయం నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మొదలైన కారణంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చరణ్ కూడా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.

Varun Tej: ఏంటి.. వరుణ్ బాబు.. పెళ్ళికి ముందే అన్ని నేర్చేసుకుంటున్నావా..?

“తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో మనం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాం. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.