పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్ స్టాప్” ఆసక్తికరంగా సాగుతోంది. గత కొన్ని వారాలుగా OTT వెర్షన్ కు మంచి వ్యూయర్‌షిప్ దక్కుతోంది. మొత్తానికి ఈ షో రోజురోజుకూ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తూ బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. హౌజ్ లో జరిగే గొడవలు, అభిప్రాయబేధాలు, టాస్కులు వంటి సంఘటనల మధ్య షో ఆరవ వారంలోకి అడుగు పెట్టింది. అయితే 5వ వారానికి గానూ ఎవరు ఎలిమినేట్ అవుతారు ? అనే విషయంపై సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి.
Read Also : RRR : చెర్రీ గోల్డెన్ హార్ట్… టీంకు ఏకంగా గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్
ఈవారం నామినేషన్ కు బిందు మాధవి, శివ, అరియానా, అనిల్ రాథోడ్, తేజస్వితో పాటు స్రవంతి కూడా నామినేట్ అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలో తేజస్వి ఎలిమినేట్ కాగా, సేఫ్ జోన్‌లో ఉన్నారు. తేజస్వి మదివాడకు వీక్షకుల నుండి తక్కువ శాతం ఓట్లు రావడంతో షో నుండి ఆమెను బయటకు పంపించారు. కానీ మిగతా తేజస్వి కంటే మెరుగైన ఓటింగ్ శాతంతో మిగతా వారు డేంజర్ జోన్ నుండి తప్పించుకున్నారు.