పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్” ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ తెలుగు నాన్‌స్టాప్”కు వీక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. గ్రిప్పింగ్ కంటెంట్‌తో, షో మేకర్స్ అందరిలో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. నాగార్జున అక్కినేని హోస్ట్ చేస్తున్న ఈ షో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఈ షో వీక్షకుల పరంగా సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. మరోపక్క కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు , అభిప్రాయబేధాలతో షో రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇక ఇప్పుడు హౌజ్ లో నుంచి మరొకరిని బయటకు పంపడానికి సమయం ఆసన్నమైంది. దీంతో ఈ వారం షో నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న విషయం ఆసక్తికరంగా మారింది.
Read Also : Allu Aravind : మెగా హీరోతో కేజీఎఫ్ లాంటి మూవీ…
శివ, అనిల్ రాథోడ్, బిందు మాధవి, తేజస్వి, అరియానా గ్లోరీ, మిత్ర, స్రవంతి ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. ఇందులో హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ ఎలిమినేషన్ కు అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ తేజస్వి ఎలిమినేషన్ తో ఈ వీకెండ్ ముగుస్తుందని వార్తలు వస్తున్నాయి. ఎలిమినేషన్ ఎపిసోడ్ రేపు ఏప్రిల్ 3న ప్రసారం అవుతుంది. తేజస్వి ఇంతకుముందు “బిగ్ బాస్” షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. మరోసారి ఓటిటి వెర్షన్ లోనూ అవకాశం దక్కించుకుంది. కాగా ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న విషయం ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అవుతుండడంతో ప్రేక్షకులు థ్రిల్ ను మిస్సయ్యే అవకాశం ఉంది.
