Mirai : యంగ్ హీరో తేజాసజ్జా దుమ్ములేపుతున్నాడు. ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడే కరెక్ట్ రూట్ ఎంచుకుంటున్నాడు. రొటీన్ రొట్టకొట్టుడు కథలు చేయకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నవే చేస్తున్నాడు. ఎలాంటి సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయో వెతికి మరీ అలాంటివే చేస్తున్నాడు. ఇప్పటికే హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరో.. ఇప్పుడు మిరాయ్ అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. పోస్టర్లు, లుక్ అదుర్స్ అన్నట్టే ఉంటున్నాయి. దాంతో ఈ మూవీ భారీ బిజినెస్ చేస్తోంది. రిలీజ్ కు ముందే నాన్ థియేట్రికల్ హక్కులు అమ్మేస్తే ఏకంగా రూ.58 కోట్లు రావడం అంటే మాటలు కాదు.
Read Also : Sreeleela : అదే తప్పు చేస్తున్న శ్రీలీల.. ఫ్యాన్స్ హర్ట్..
హాట్ స్టార్ డిటిజల్ హక్కులను సొంతం చేసుకుంది. దీని కోసం భారీగానే చెల్లించింది. ఇక థియేట్రికల్ రైట్స్ పేరుంతో ఎంత లేదన్నా ఇంకో రూ.80 కోట్ల దాకా రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రోజుల్లో సీనియర్ హీరోలు, టైర్-1 హీరోల సినిమాలే తడబడుతూ బిజినెస్ చేస్తున్న టైమ్ లో.. తేజాసజ్జా సినిమా ఇలాంటి భారీ బిజినెస్ చేయడం అంటే మాటలు కాదు. నిజంగా తేజాకు అంత మార్కెట్ ఉందా అంటే లేదు. కానీ అతను ఎంచుకుంటున్న మూవీ కంటెంట్ మీద నమ్మకం పెరుగుతోంది. తేజా మూవీ చేశాడంటే కచ్చితంగా కంటెంట్ ఉంటేనే చేస్తాడు అనే ముద్ర ఇప్పటికే వేసుకున్నాడు. కాబట్టి ఆ లాజిక్ ఇప్పుడు మిరాయ్ మూవీకి వర్తిస్తోంది. అందుకే మిరాయ్ సినిమాకు ఇంత భారీగా బిజినెస్ జరుగుతోంది. మూవీ గనక పెద్ద హిట్ అయితే మాత్రం కచ్చితంగా స్టార్ హీరో కాకపోయినా పెద్ద హీరోల లిస్టులో తేజా చేరిపోవడం ఖాయం అంటున్నారు ఆయన ఫ్యాన్స్.
Read Also : HHVM : ప్రీమియర్ షోలు.. వీరమల్లుకు కలిసొస్తాయా..?
