చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోని… చిన్నప్పటి నుంచి సినిమాల్లోనే పెరిగి ఇప్పుడు సోలో హీరోగా ఎదిగాడు తేజ సజ్జ. హీరోగా మారిన తర్వాత కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తూ కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ ఉన్నాడు. ప్రశాంత్ వర్మతో కలిసిన తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా హనుమాన్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీపై పాజిటివ్ వైబ్ ఉంది. ఇప్పటికే ఉన్న అంచనాలని మరింత పెంచుతూ హనుమాన్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ ట్రైలర్ గ్రాండ్ స్కేల్ లో ఉండడంతో హనుమాన్ మూవీపై హైప్ మరింత పెరిగింది.
హనుమాన్ ట్రైలర్ లాంచ్ లో తేజ సజ్జా ఒక సీనియర్ రిపోటర్ కి షాకింగ్ రిప్లై ఇచ్చాడు. “హనుమాన్ ట్రైలర్ బాగుంది, స్కేల్ చాలా పెద్దగా ఉంది. ఈ స్కేల్ లో మిమ్మల్ని చూస్తేనే కాస్త ఎక్కువగా ఉంది. మీకు ఇది సరిపోతుందా?” అని అర్ధం వచ్చేలా ఒక ప్రశ్నని సీనియర్ రిపోటర్ అడిగాడు. ఈ ప్రశ్నకి తేజ సజ్జా “ఈ మధ్య వచ్చిన టయర్ 2 హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసినప్పుడు, ఇదే క్వేషన్ మీరు వాళ్లని అడిగారా? నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచి కష్టపడి… సోలో హీరోగా సినిమాలు చేసుకుంటూ… బయట డైరెక్టర్స్ తో సినిమాలు కూడా చేసుకోని ఈ ప్రాజెక్ట్ చేస్తుంటే నన్ను అడుగుతున్నారు. ఈ సినిమా నాకు ఏం ఇచ్చింది అనేది మీ అందరూ చూసారు. ఈ ప్రాజెక్ట్ కి నేను ఏం ఇచ్చాను అనేది ప్రశాంత్ వర్మ అండ్ నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ సినిమా అయిపొయింది, దీన్ని నా నుంచి ఎవరు లాక్కోలేరు” అంటూ సమాధానం ఇచ్చాడు. హనుమాన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నుంచి తేజ సజ్జ చెప్పిన ఈ సమాధానంకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.