Site icon NTV Telugu

Maa Kaali: హిందువులకు వేరే దారి లేదు.. మతం మారితేనే బ్రతుకు లేకపోతే చావు’’ అంటూన్న రైమా సేన్

Maxresdefault

Maxresdefault

Maa Kaal Teaser Out Now: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నా చిత్రం “మా కాళి” రైమా సేన్ మరియు ఐఎఎస్ అధికారిగా మారిన నటుడు అభిషేక్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నఈ సినిమాని డైరెక్టర్ విజయ్ యెలకంటి తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు బెంగాల్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు ఇలాంటి సినిమాలు తీయాలి అంటే ఆ సినిమా చుట్టూ కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయని, రిలీజ్‌ ఆగిపోతుందని భయపడేవారు. కానీ ఓటీటీ అనేది వచ్చిన తర్వాత థియేటర్లలో విడుదల కాకపోతే సినిమాను నేరుగా ఓటీటీలో అయినా విడుదల చేస్తామని చాలా బోల్డ్ కంటెంట్‌తో ముందుకొస్తున్నారు మేకర్స్.

Also Read: Niharika NM : నక్క తోక తొక్కిన నిహారిక.. ఏకంగా గీతా ఆర్ట్స్ సినిమాతో?

అలాంటి మరొక బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘మా కాళి’. బెంగాల్‌లో స్వాతంత్ర్యం సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదలయ్యింది. 1946లో బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్‌లో ‘మా కాళి’ టీజర్ మొదలవుతుంది. ‘మనం చాలా ఏళ్ల పాటు హిందువుల మీద అధికారం చలాయించాం. మరి ఇప్పుడు వాళ్ల అధికారంలో మనం ఉందామా అంటూ ఒక ముస్లిం వ్యక్తి ప్రశ్నిస్తాడు. దీంతో ఇప్పటినుండి హిందుస్థాన్ ఉండదు, పాకిస్థాన్ మాత్రమే ఉంటుంది అంటూ ప్రజలంతా నినాదాలు చేస్తుంటారు. హిందుస్థాన్‌కు అధికారం బదిలీ చేయాలని బ్రిటీష్ సర్కార్ నిర్ణయించింది. హిందువులు అఖండ భారత్ కోసం పగటి కలలు కంటున్నారు’’ అంటూ హిందూ ముస్లిం విభేదాలను రెచ్చగొడతాడు ఆ దేశ ప్రధాన మంత్రి హుసేన్ షాహేద్.

Also Read:Darshan Wife: నాకు, నా కొడుక్కి ఎలాంటి ఇబ్బంది రావొద్దు.. కమిషనర్‌కు దర్శన్ భార్య లేఖ!

జిన్నా సాబ్ ఆదేశాల మేరకు ఆగస్ట్ 16ను డైరెక్ట్ యాక్షన్ డేగా ప్రకటిస్తున్నాను అంటూ ప్రకటిస్తాడు. దీంతో ముస్లిం కమ్యూనిటీ అంతా ఒక్కటవుతుంది. హిందువులను విచక్షణ లేకుండా చంపడం మొదలుపెడతారు. ‘‘అల్లా మనతోనే ఉన్నాడు. ఈ గడ్డ పాకిస్థాన్ అయ్యి తీరుతుంది’’ అంటూ నినాదాలు చేస్తూ కంటికి కనిపించిన హిందువులను చంపుకుంటూ పోతారు. ఆ గొడవల్లో రైమా సేన్ కుటుంబానికి దిక్కుతోచదు. ఆ ఘర్షణల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. హిందువులకు వేరే దారి లేదు. మతం మారితేనే బ్రతుకు లేకపోతే చావు అంటూ రైమా సేన్ చెప్పే డైలాగ్‌తో ‘మా కాళి’ టీజర్ ముగుస్తుంది. ఇక ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, బెంగాలీలో కూడా విడుదల కానుంది.  ‘కశ్మీర్ ఫైల్స్’, ‘కేరళ స్టోరీ’ తరహాలోనే ‘మా కాళి’ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Exit mobile version