Maa Kaali: హిందువులకు వేరే దారి లేదు.. మతం మారితేనే బ్రతుకు లేకపోతే చావు’’ అంటూన్న రైమా సేన్
- ఆగస్ట్ 16ను డైరెక్ట్ యాక్షన్ డేగా ప్రకటిస్తున్నా
- హిందువులకు వేరే దారి లేదు.. మతం మారితేనే బ్రతుకు లేకపోతే చావు
- బెంగాల్లో స్వాతంత్ర్యం సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా మా కాళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maa Kaal Teaser Out Now: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నా చిత్రం “మా కాళి” రైమా సేన్ మరియు ఐఎఎస్ అధికారిగా మారిన నటుడు అభిషేక్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నఈ సినిమాని డైరెక్టర్ విజయ్ యెలకంటి తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు బెంగాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు ఇలాంటి సినిమాలు తీయాలి అంటే ఆ సినిమా చుట్టూ కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయని, రిలీజ్ ఆగిపోతుందని భయపడేవారు. కానీ ఓటీటీ అనేది వచ్చిన తర్వాత థియేటర్లలో విడుదల కాకపోతే సినిమాను నేరుగా ఓటీటీలో అయినా విడుదల చేస్తామని చాలా బోల్డ్ కంటెంట్‌తో ముందుకొస్తున్నారు మేకర్స్.
Also Read: Niharika NM : నక్క తోక తొక్కిన నిహారిక.. ఏకంగా గీతా ఆర్ట్స్ సినిమాతో?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
అలాంటి మరొక బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘మా కాళి’. బెంగాల్లో స్వాతంత్ర్యం సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదలయ్యింది. 1946లో బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్లో ‘మా కాళి’ టీజర్ మొదలవుతుంది. ‘మనం చాలా ఏళ్ల పాటు హిందువుల మీద అధికారం చలాయించాం. మరి ఇప్పుడు వాళ్ల అధికారంలో మనం ఉందామా అంటూ ఒక ముస్లిం వ్యక్తి ప్రశ్నిస్తాడు. దీంతో ఇప్పటినుండి హిందుస్థాన్ ఉండదు, పాకిస్థాన్ మాత్రమే ఉంటుంది అంటూ ప్రజలంతా నినాదాలు చేస్తుంటారు. హిందుస్థాన్‌కు అధికారం బదిలీ చేయాలని బ్రిటీష్ సర్కార్ నిర్ణయించింది. హిందువులు అఖండ భారత్ కోసం పగటి కలలు కంటున్నారు’’ అంటూ హిందూ ముస్లిం విభేదాలను రెచ్చగొడతాడు ఆ దేశ ప్రధాన మంత్రి హుసేన్ షాహేద్.
Also Read:Darshan Wife: నాకు, నా కొడుక్కి ఎలాంటి ఇబ్బంది రావొద్దు.. కమిషనర్‌కు దర్శన్ భార్య లేఖ!
జిన్నా సాబ్ ఆదేశాల మేరకు ఆగస్ట్ 16ను డైరెక్ట్ యాక్షన్ డేగా ప్రకటిస్తున్నాను అంటూ ప్రకటిస్తాడు. దీంతో ముస్లిం కమ్యూనిటీ అంతా ఒక్కటవుతుంది. హిందువులను విచక్షణ లేకుండా చంపడం మొదలుపెడతారు. ‘‘అల్లా మనతోనే ఉన్నాడు. ఈ గడ్డ పాకిస్థాన్ అయ్యి తీరుతుంది’’ అంటూ నినాదాలు చేస్తూ కంటికి కనిపించిన హిందువులను చంపుకుంటూ పోతారు. ఆ గొడవల్లో రైమా సేన్ కుటుంబానికి దిక్కుతోచదు. ఆ ఘర్షణల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. హిందువులకు వేరే దారి లేదు. మతం మారితేనే బ్రతుకు లేకపోతే చావు అంటూ రైమా సేన్ చెప్పే డైలాగ్‌తో ‘మా కాళి’ టీజర్ ముగుస్తుంది. ఇక ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, బెంగాలీలో కూడా విడుదల కానుంది. ‘కశ్మీర్ ఫైల్స్’, ‘కేరళ స్టోరీ’ తరహాలోనే ‘మా కాళి’ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!