NTV Telugu Site icon

Samantha: శాకుంతలం ప్రమోషన్స్ మొదలుపెట్టిన సమంత

Sam

Sam

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యనే మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడింది. ఇక యశోద సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఏడాది శాకుంతలం చిత్రంతో అభిమానుల ముందుకు రానుంది. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం ఏప్రిల్ 14 న పరిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. శకుంతల- దుశ్యంతుల ప్రేమ కావ్యంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎన్నో వాయిదాలా తరువాత ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు. అందులోనూ దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేస్తుండడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Balakrishna: నా సినిమాల జోలికి వస్తే వేరేలా ఉంటుంది… బాలయ్య మాస్ వార్నింగ్

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. సమంత కొద్దిగా కోలుకోవడంతో ఆమె కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొననుంది. తాజాగా శాకుంతలం చిత్రం బృందం పెద్దమ్మ తల్లి టెంపుల్ లో సందడి చేశారు. శుభప్రదంగా అమ్మవారి ఆశీస్సులు అందుకొని ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. సమంత, హీరో దేవ్ మోహన్, డైరెక్టర్ గుణశేఖర్, ఆయన కుమార్తె, నిర్మాత నీలిమ గుణ, నిర్మాత దిల్ రాజు కలిసి పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే సామ్ కు దైవ భక్తి ఎక్కువే అన్న విషయం తెల్సిందే. తన ప్రతి సినిమాకు ముందు తిరుపతి వెళ్లి స్వంవివారి ఆశీస్సులు అందుకోవడం ఆమెకు అలవాటు. మరి ఈ సినిమా సామ్ కు ఎలాంటి విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి.