మాస్ మహారాజా రవితేజ, యువ దర్శకుడు సుధీర్ వర్మతో కలిసి “రావణాసుర” అనే ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న విషయం తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. తాజా అప్డేట్ ఏమిటంటే… టీమ్ సుదీర్ఘమైన, ముఖ్యమైన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలు, అత్యంత తీవ్రమైన యాక్షన్ బ్లాక్‌లు కూడా రూపొందించారు మేకర్స్. అతి తక్కువ సమయంలోనే టీమ్ మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. రవితేజ చేతుల్లో వరుస సినిమాలు ఉండడంతో శరవేంగంగా ఒక్కో సినిమా చిత్రీకరణ పూర్తయ్యేలా చూసుకుంటున్నారు.
Read Also : Acharya Trailer: అదరహో.. ‘ఆచార్య’!
అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీమ్‌వర్క్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్‌గా సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు కూడా సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
