Site icon NTV Telugu

ఆఖరి నిమిషంలో ‘పుష్ప’రాజ్ ఆందోళన… తొలగిన అడ్డంకి

Pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప : ది రైజ్’కి ఆఖరి నిమిషంలో అడ్డంకి తొలగిపోవడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడ్డా కూడా విరామం లేకుండా పని చేస్తోంది ‘పుష్ప’ టీమ్.

ఆఖరి నిమిషంలో హడావిడి… పోస్ట్ పోన్ టెన్షన్
సుకుమార్, ఆయన బృందం చివరి నిమిషంలో సినిమా DI కరెక్షన్ల పనిలో ఉన్నారు. సినిమా కంటెంట్ అనుకున్న సమయానికి రాకపోవడంతో యూఎస్ఏ ప్రీమియర్ షోలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు విన్పించాయి. సినిమా ఫైనల్ ప్రింట్ నిన్న క్యూబ్/యుఎఫ్‌ఓకు డెలివరీ కాలేదు. ఇది డిస్ట్రిబ్యూటర్‌లు, అభిమానులను కొంత ఆందోళనకు గురి చేసింది. అయితే తాజా వార్త ఏమిటంటే ‘పుష్ప’ బృందం ఇప్పుడు విజయవంతంగా కంటెంట్‌ను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌లకు డెలివరీ చేసి, సమస్యను పరిష్కరించింది. నిజానికి ఇది ‘పుష్ప’ టీంకు పెద్ద ఊరటనిచ్చే విషయం.

Read Also : బాలయ్యతో జక్కన్న… ‘అన్‌స్టాపబుల్’ ఫన్ అండ్ ప్రమోషన్స్

కాస్త ఆలస్యమైనా అనుకున్నట్టుగానే…
మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ అయితే ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి సినిమా పూర్తవుతుందా ? లేదా ? అనేది మాత్రం కాస్త డౌట్ ఫుల్ గానే ఉంది మేకర్స్ కి సైతం. అందుకే దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా హాజరు కాకుండానే సినిమా పనుల్లో నిమగ్నమైపోయారు. మొత్తానికి వారి శ్రమ ఫలించి సినిమాను అనుకున్న సమయానికి ప్రీమియర్ చేయబోతున్నారు.

బన్నీ భుజాలపై ప్రమోషన్స్ బాధ్యత…
సినిమా విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ప్రమోషన్ల పరంగా చిత్రబృందం ఇంకా వెనుకబడే ఉందని చెప్పాలి. ఒకవైపు అల్లుఅర్జున్, రష్మిక మాత్రం ఏమాత్రం గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వీలైనంత వరకూ ప్రమోషన్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈరోజు ముంబైలో బాలీవుడ్ మీడియాతో మీడియా ఇంటరాక్షన్‌లో పాల్గొననున్నారు. పుష్ప అద్భుతమైన అంచనాలతో రాబోతోంది. మూవీ ప్రీ-సేల్స్ కూడా బాగున్నాయి. ఇక ‘పుష్ప’ రికార్డు స్థాయిలో విడుదలవుతోంది. ఈ చిత్రంతో అల్లు అర్జున్ హిందీ, తమిళ మార్కెట్‌లలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ‘పుష్ప’ ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రష్మిక, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి భారీ హైప్ తో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Read Also : “రాధేశ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఫిక్స్

వివాదమే పబ్లిసిటీ
సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో సినిమాపై బాగానే అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా స్పెషల్ సాంగ్ తో సామ్ చేసిన మ్యాజిక్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. ఆమె చేసిన ‘ఊ అంటావా’ సాంగ్ లోని లిరిక్స్ వివాదాస్పదమైనప్పటికీ బన్నీ, సామ్ అభిమానులు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తుంటే సాంగ్ పై కేసు వేసినప్పటికీ వివాదం సెగ సినిమాకు ఏమాత్రం తగల్లేదనే అన్పిస్తోంది. ఒక రకంగా ఈ వివాదంతో సినిమాకు మరింత పబ్లిసిటీ వచ్చిందనే చెప్పాలి.

Exit mobile version