Site icon NTV Telugu

L2E Empuran: మాఫియాను గడగడలాడించే అబ్రహం ఖురేషినీ చూశారా?

Lc

Lc

The highly anticipated sequel of Lucifer: మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన సినిమా లూసిఫర్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 కేర‌ళ‌లో బిగ్గెస్టు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో టోవినో థామస్, వివేక్ ఒబెరాయ్, మంజు వారియ‌ర్, కీలక పాత్రల్లో నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ స్పెషల్ క్యామియోలో కనిపించాడు. ఆ తరువాత లూసిఫర్ కు సీక్వెల్ ప్రకటించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఎప్పటినుంచో సీక్వెల్ వస్తున్నట్లు వార్తలు వచ్చినా పూజా కార్యక్రమాలను ఫినిష్ చేసి మేకర్స్ అధికారికంగా లూసిఫర్ 2 ను ప్రకటించారు. లూసిఫర్ 2 ఎంపురాన్ ఆమె పేరుతో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది.

Also Read: Aashu Reddy: అందాలు ఆరబోస్తున్న ఆశు రెడ్డి

నేడు మోహన్ లాల్ పుట్టిన రోజు సందర్భంగా లూసిఫెర్ టీం నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో మోహన్ లాల్ చుట్టు బాడీ గార్డ్స్ ఉండగా అతను నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. అయితే లూసిఫర్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం ఇంక వెల్లడించలేదు. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే లూసిఫెర్ చివర్లో.. మోహన్ లాల్.. విదేశాల్లో ఒక మాఫియా డాన్ గా ఉండడం చూపించారు. తన తమ్ముడైన టోవినో థామస్ ను సీఎం గా చేసి.. వెళ్లిన లూసిఫర్ అస్సలు ఎవరు..తండ్రి లాంటి వ్యక్తి నుంచి దూరమైన ఒక యువకుడు.. లూసిఫర్ గా ఎలా మారాడు అనేది ఈ సీక్వెల్ లో చూపించనున్నారు.

Exit mobile version