NTV Telugu Site icon

Double Ismart: డబుల్ ఇస్మార్ట్ సెట్ లో అడుగుపెట్టిన సంజయ్ దత్..

Ram

Ram

Double Ismart: ఎనర్జిటిక్ స్టార్ రామ్ – పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ ఊర మాస్ లుక్.. పూరి హీరో మాస్ డైలాగ్స్ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తున్న విషయం తెల్సిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి- ఛార్మి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూరి- ఛార్మి లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకొని పూర్తిగా నష్టాల పాలయ్యారు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో అనౌన్స్ జనగణమణ కూడా అటకెక్కింది. దీంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్న ఈ జంట మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి డబుల్ ఇస్మార్ట్ ను రెడీ చేస్తున్నారు.

Bandla Ganesh: రవితేజను నమ్మించి.. దారుణంగా మోసం చేశా..

ఇప్పటికే స్కంద సినిమాను ఫినిష్ చేసిన రామ్.. గ్యాప్ లేకుండా డబుల్ ఇస్మార్ట్ సెట్ లో అడుపెట్టాడు. పూరి జగన్నాథ్ టేకింగ్ గురించి అందరికి తెలిసిందే. మూడు నెలల్లో సినిమా ఫినిష్ చేయగలడు. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ ను కూడా అదే స్పీడ్ తో పూర్తి చేసేస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసిన పూరి రెండో షెడ్యూల్ ను థాయ్ ల్యాండ్ లో మొదలుపెట్టాడు. ఇక ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పాల్గొన్నాడు. ఇందులో సంజయ్ విలన్ గా నటిస్తున్నాడు. షూటింగ్ కన్నా ముందు బ్యాంకాక్ లో ఇదుగో ఇలా చిత్ర బృందం సందడి చేస్తూ కనిపించారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 8 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో పూరి – ఛార్మి బౌన్స్ బ్యాక్ అవుతారా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Show comments