Samantha: ద్రౌపది ముర్మును కలిసిన ‘సిటాడెల్’ టీమ్ .. ఫోటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ సమంత జంటగా ది ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిరీస్ సిటాడెల్. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ సిరీస్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం సిటాడెల్ టీమ్ సెర్బియా లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా సిటాడెల్ టీమ్ .. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిశారు. సెర్బియాలో వారు ద్రౌపది ముర్మును కలిసినట్లు తెలిపారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను వరుణ్ ధావన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. “టీమ్ సిటాడెల్ ఇండియా గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని కలిసే అధికారాన్ని పొందింది. సెర్బియాలో ద్రౌపది ముర్ము జీ. మేడమ్ మిమ్మల్ని కలవడం ఎంత గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం” అని తెలిపారు. సిటాడెల్ టీమ్ తో ద్రౌపది ముర్ము కొద్దిసేపు ముచ్చటించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Aata Sundeep: పెళ్లి తరువాత లవ్ ఎఫైర్.. నా భార్యే దగ్గర ఉండి ముద్దు పెట్టించింది
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ఇకపోతే సిటాడెల్ ఇప్పటికే ఇంగ్లిష్ లో ప్రియాంక చోప్రా నటించిన విషయం తెల్సిందే. అయితే ఆ సిటాడెల్ ప్రీక్వెల్ గా ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా తల్లిదండ్రులుగా వరుణ్, సమంత కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్ కోసం సామ్.. చాలా కష్టపడుతుంది. యాక్షన్ సీక్వెన్స్ లో సామ్ తన విశ్వరూపాన్ని చూపించనుందని టాక్. త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులో సమ .. ఖుషీ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం సామ్ ఫోకస్ అంతా సిటాడెల్ మీదనే ఉందని తెలుస్తోంది. మరి ఈ సిరీస్ తో సామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!