Site icon NTV Telugu

Adipurush: జై హనుమాన్… ఓం మావ స్పీడ్ పెంచాడు

Adipurush

Adipurush

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జూన్ 16న బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రభాస్ సినిమా థియేటర్స్ కి వచ్చిన రోజు, రికార్డులు చెల్లా చెదురు అవ్వకుండా ఆప్ శక్తి ఇంకొకటి లేదు. మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేయకుండా ఆదిపురుష్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ వంద కోట్ల ఓపెనింగ్ సరిపోదు అనుకుంటున్నాడేమో ఓం రౌత్ ప్రమోషన్స్ లో స్పీడ్ మరింత పెంచాడు. 150-200 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని టార్గెట్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు. జై శ్రీ రామ్, రామ్ సీత రామ్ సాంగ్స్ క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇప్పటికీ ఇండియా మొత్తం వినిపిస్తూనే ఉంది. ఈ రెండు సాంగ్స్ ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ కి ప్రాణం పోశాయి. బిజినెస్ అమాంతం పెరగడానికి కూడా ఆ రెండు పాటలే కారణం అయ్యాయి.

జూన్ 6న తిరుపతిలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ చేయడానికి ఆదిపురుష్ చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. జై శ్రీరామ్ అని శబ్దం చేసే బాణాసంచాని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమాకి జరగనంత గ్రాండ్ గా ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఆదిపురుష్ పై అంచనాలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఇప్పటికే నార్త్ లో ఆదిపురుష్ సినిమాపై ఉన్న హైప్ చూస్తే పిచ్చెక్కి పోవడం గ్యారెంటీ. లేటెస్ట్ గా హనుమాన్ పోస్టర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ “హమ్ హై కేసరి, క్యా బరాబర్రి” అంటూ కొటేషన్ కూడా ఇచ్చారు. ఈ స్లోగన్ తో నార్త్ ఆడియన్స్ అంతా హల్చల్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కొటేషన్ ఒక స్లోగన్ గా మారి నార్త్ లో వినిపించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఆదిపురుష్ టీమ్ ఇదే స్పీడ్ అండ్ జోష్ ని రిలీజ్ వరకు మైంటైన్ చేస్తే చాలు ఇండియన్ బాక్సాఫీస్ ముందెన్నడూ చూడని కలెక్షన్ల వర్షం ఆదిపురుష్ చూపిస్తుంది.

Exit mobile version