Site icon NTV Telugu

Neethone nenu: టీచ‌ర్స్ డే స్పెషల్..‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు’ సాంగ్ రిలీజ్

Neethone Nenu

Neethone Nenu

Teacher’s day special song from Neethone nenu Released:‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు హీరోయిన్లుగా ఒక సినిమా తెరకెక్కుతోంది. శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకి ‘నీతోనే నేను’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. షూట్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఉపాధ్యాయుల దినోత్సవం (టీచ‌ర్స్ డే) సందర్భంగా ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఉపాధ్యాయులని బ్ర‌హ్మ‌, విష్ణు, మ‌హేశ్వ‌రుల‌తో పోలుస్తుంటారు, అలాంటి వారికి అంకిత‌మిచ్చేలా ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు’ పాట‌ను డిజైన్ చేశారు. ప్ర‌ముఖ సింగ‌ర్ మ‌నో పాడిన ఈ పాట‌ను స్టార్ రైట‌ర్ సుద్ధాల అశోక్ తేజ రచించారు.

Health Tip: మందు తాగుతారా? అయితే ఈ కూరగాయ రసం తాగండి అంతా సెట్ అయిపోతుంది

ఇక సాంగ్ రిలీజ్ సందర్భంగా నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మంచి సమాజం కావాలంటే మనకు గొప్ప ఉపాధ్యాయులు కావాలని, టీచ‌ర్స్ వ‌ల్లే అది సాధ్య‌మ‌వుతుందని అన్నారు. అలాంటి వారి గొప్ప‌తనాన్ని తెలియ‌జేసేలా మా సినిమాలో ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ పాట ఉందని అన్నారు. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశాను, రామ్ అనే పాత్ర కూడా గవర్నమెంట్ టీచర్ ఆ సిస్టంలోని లోపాలను సరిదిద్దేక్రమంలో జరిగే కథే ‘నీతోనే నేను’ అని అన్నారు. డైరెక్టర్ అంజి రామ్ మాట్లాడుతూ ‘‘టీచర్స్ డే సందర్బంగా మా సినిమా నుంచి ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉందని, సుద్ధాల అశోక్ తేజ‌గారు రాసిన ఈ పాట‌ను మ‌నోగారు అద్భుతంగా పాడారు ఈ పాట అంద‌రికీ న‌చ్చుతుంది’’ అని అన్నారు. కార్తీక్ బి.క‌డ‌గండ్ల‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ముర‌ళీ మోహ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌.

Exit mobile version