NTV Telugu Site icon

Harish Shankar: మొన్న నితిన్ గడ్కరీ.. ఇప్పుడు తరుణ్ ఛుగ్.. బీజేపీ లీడర్స్ తో హరీష్ ముచ్చట్లేంటి?

Harish Shankar Tarun Chug

Harish Shankar Tarun Chug

BJP Tarun Chug Visits Harish Shankar’s Office: ఎలా అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు ముఖ్యంగా తెలంగాణ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు తెలంగాణలో పర్యటన ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా టాలీవుడ్ హీరోలు లేదా ఇతర టాలీవుడ్ ప్రముఖులను కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ అవ్వగా నితిన్ తో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం అయ్యారు. ఇక రాజమౌళితో అమిత్ షా సమావేశం అవ్వాల్సి ఉంటది కానీ ఎందుకో అది క్యాన్సిల్ అయింది. అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఏకంగా ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. అసలు ఆయన గడ్కరీని ఎందుకు కలిశారు అనే విషయం మీద క్లారిటీ లేదు. అయితే చేసిన మంచి పనులను చెప్పుకునేందుకు బీజేపీ సంపర్క్ అభియాన్ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

Narne Nithin: గీతా ఆర్ట్స్ 2లో ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా ప్రకటన.. కానీ ఆ విషయంలో షాకిచ్చారే!

బహుశా ఆ కార్యక్రమంలో భాగంగా కలిసి ఉండవచ్చు అనుకున్నారు కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ ఏకంగా హరీష్ శంకర్ ఆఫీస్ కి వెళ్లి మరీ కలవడం హాట్ హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఫోటోలతో సహా షేర్ చేసి హరీష్ శంకర్ అందరితో పంచుకున్నాడు. తరుణ్ ఛుగ్ ను టాగ్ చేస్తూ మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు థాంక్స్, మీరు సమయం వెచ్చించి మా ఆఫీసును చూసినందుకు మళ్లీ థాంక్స్ చెబుతున్నాను, మీతో చాలా మంచి వాల్యూబల్ సమయాన్ని గడిపాను అని అనుకుంటున్నాను అని కామెంట్ చేశారు. ఇక ఆయన షేర్ చేసిన ఫొటోలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న వివేక్ కూచిభొట్ల కూడా కనిపిస్తూ ఉండటం గమనార్హం. హరీష్ శంకర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ప్రస్తుతానికి సినిమాలు చేయడం లేదు కానీ ఆ సంస్థకు చెందిన నిర్మాతతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తో భేటీ కావడం మాత్రం చర్చకు దారితీస్తోంది.