Site icon NTV Telugu

VijayDevarakonda : విజయ్ తో తరుణ్ భాస్కర్ మూవీ.. అంతా ఉత్తదేనా..?

Vijay

Vijay

VijayDevarakonda : టాలీవుడ్ లో ఈ నడుమ రూమర్లు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. అవేవీ హీరోయిన్, హీరోకు సంబంధించినవి కాదండోయ్. కేవలం హీరో, డైరెక్టర్ల గురించే. ఆ హీరో పలానా డైరెక్టర్ తో మూవీ చేస్తున్నాడంట అని.. లేదంటే పలానా హీరోకు డైరెక్టర్ కథ చెప్పేశాడంట అన్నట్టు మొదలెడుతున్నారు. అయితే తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో తరుణ్ భాస్కర్ ఓ మూవీ చేస్తున్నాడని.. దాని పేరు బినామీ అంటూ వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి కాంబోలో గతంలో పెళ్లి చూపులు మూవీ వచ్చి భారీ హిట్ అయింది. విజయ్ ను హీరోగా పరిచయం చేస్తూ హిట్ ఇచ్చింది ఈ మూవీనే. దాని తర్వాత విజయ్ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. కానీ తరుణ్ భాస్కర్ మాత్రం పెద్దగా మూవీలు చేయలేదు. ఆ సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే మూవీ తీశాడు.

Read Also : Operation Sindoor Live Updates: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు..
అది యూత్ కు బాగా కనెక్ట్ అయింది. రెండేళ్ల క్రితం కీడాకోలా సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి మరో మూవీ డైరెక్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు విజయ్ హీరోగా బినామీ సినిమా చేస్తున్నాడంటూ అంటున్నారు. కానీ విజయ్ ప్రస్తుతం వరుస మూవీలతో బిజీగా ఉన్నాడు. కింగ్ డమ్, రౌడీ జనార్ధనా, రాహుల్ సంకృత్యన్ తో వరుస సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ కావడానికి ఎంత లేదన్నా ఇంకో మూడేళ్లు పడుతుంది. అప్పటి దాకా తరుణ్‌ భాస్కర్ వెయిట్ చేయడం అంటే పెద్ద మిస్టేక్. అందుకే తరుణ్ మనసు మార్చుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వేరే హీరో కోసం వెతుకుతున్నాడంట. అన్నీ కుదిరితే ఆనంద్ దేవరకొండతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం తరుణ్‌ హీరోగా నటించిన ఓ మలయాళ రీమేక్ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతోంది.
Read Also : Nayanathara : నయనతారను కలిసేందుకు వెళ్లిన అనిల్ రావిపూడి

Exit mobile version