Tarakaratna: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గత 22 రోజులుగా ఆయన బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందుకుంటున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.. తారకరత్న కోసం విదేశీ వైద్యుల బృందం రంగంలోకి దిగారు. ఆయనకు చికిత్స జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ సహా కుటుంబసభ్యులు మొత్తం హాస్పిటల్ కు చేరుకున్నారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు సాయంత్రం 4.30కి హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. నారా లోకేష్ పాదయాత్రలో కళ్ళు తిరిగి పడిపోయిన తారకరత్నను కుప్పం హాస్పిటల్ లో చేర్పించగా అతనికి తీవ్ర గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ఖరారు చేశారు. వెంటనే తారకరత్నను మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో అడ్మిట్ చేసి వైద్యం అందిస్తున్నారు. ఆయన కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని కోరుకుంటున్నారు.
