నందమూరి తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మహా శివరాత్రి రోజునే శివైక్యం అయ్యారు. నందమూరి అభిమానులనే కాదు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని కూడా తారక రత్న మరణం కలచివేస్తుంది. 39 ఏళ్ల వయసులోనే తారక రత్న చనిపోవడం అందరినీ బాధిస్తోంది. ఫార్మాలిటీస్ పూర్తి చేసి తారక రత్న భౌతికకాయాన్ని బెంగళూరు నుంచి ఉదయం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకోని వచ్చారు. ఆయన పార్థివ దేహాన్ని నేరుగా మోకిలలోని స్వగృహానికి తీసుకోని వచ్చారు. రేపు అభిమానుల సందర్శనార్ధం తారక రత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నారు. తారక రత్న మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Read Also: Nandamuri Tarakaratna: తారకరత్న మృతి.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం