Site icon NTV Telugu

Tanushree Dutta: నాకు ఏదైనా జరిగితే దానికి కారణం ఆ హీరోనే.. వదిలిపెట్టకండి

Tanushree

Tanushree

Tanushree Dutta: తనుశ్రీ దత్తా.. ఈ పేరు వారుండరు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తను అంతకంటే ఎక్కువగా మీటూ ఉద్యమానికి నాంది పలికి ఫేమస్ అయ్యింది. మొట్ట మొదటిసారి ఒక హీరో తనను లైంగికంగా వేధించాడంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పిన హీరోయిన్ తనుశ్రీ దత్తా. ఈమె ఇచ్చిన ధైర్యంతోనే మిగతా హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో నానా పటేకర్ తననుశారీరకంగా వేధించాడని బాహాటంగా చెప్పి ఎన్నో అవమానాల పాలయ్యింది. ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. మీటూలో నానా పటేకర్ పై ఆమె చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని బాలీవుడ్ మాఫియా ఆమెను వేధించడం మొదలుపెట్టాయి. దాదాపు ఐదారేళ్లుగా ఆ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అదే విషయాన్ని ఆమె తాజాగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొంది.

“నాకు ఏదైనా జరిగితే దానికి కారణం #metoo నిందితుడు నానా పటేకర్, అతని లాయర్లు & సహచరులు & అతని బాలీవుడ్ మాఫియా స్నేహితులే బాధ్యులని తెలియజేస్తున్నాను. బాలీవుడ్ మాఫియా ఎవరు అని అంటే.. ఎస్‌ఎస్‌ఆర్‌(సుశాంత్ సింగ్ రాజ్ పుత్) మృతి కేసులో వారి పేర్లన్నీ తరచూ తెరపైకి వచ్చినవారే. (అందరికీ ఒకే క్రిమినల్ లాయర్ ఉన్నారని గమనించండి). వారి సినిమాలను చూడకండి, వాటిని పూర్తిగా బహిష్కరించండి. ప్రతీకారంతో నా తరుపున వారిని వెంబడించండి. వారిని వదిలిపెట్టకండి. నన్ను చాలా వేధించినందుకు వారి జీవితాలను నరకయాతన చేయండి. చట్టం & న్యాయం నాకు విఫలమై ఉండవచ్చు కానీ ఈ గొప్ప దేశ ప్రజలపై నాకు నమ్మకం ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తనుశ్రీ ఈ విధంగా చెప్పడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు హత్యా బెదిరింపులు వస్తున్నాయి అనుకుంటా.. దయచేసి ఆమెకు సహాయం చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు పోలీసుల వద్దకు వెళ్లి ప్రొటక్షన్ తీసుకోమ్మని సలహాలు ఇస్తున్నారు.

Exit mobile version