Site icon NTV Telugu

Tanisha Kuppanda: అడల్ట్ సినిమాలో నగ్నంగా నటించే ఆఫర్.. నటి ఏం చెప్పిందంటే?

Tanisha

Tanisha

Tanisha Kuppanda Gives Strong Reply Over Adult Movie Offer: సినీ ప్రపంచంలో కథానాయికలకు గ్లామర్ షో చేయక తప్పదు. నలుగురి దృష్టిలో పడాలన్నా.. ఫాలోయింగ్ పొందాలన్నా.. పాపులారిటీ గడించాలన్నా.. కచ్ఛితంగా అందాలు ఒలకబోయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టార్ హోదాలో ఉన్న భామలు సైతం.. ఒకప్పుడు గ్లామర్ షోతో పాటు రొమాంటిక్ సీన్లలోనూ నటించినవారే! సో.. ఇండస్ట్రీలో అమ్మాయిల సక్సెస్ ఫార్ములాకి తొలిమెట్టు గ్లామర్ షోనే కాబట్టి.. కొత్తగా వచ్చినవాళ్లు అందాలతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి నటీమణుల్లో తనిషా కుప్పండ కూడా ఒకరు. తొలుత సీరియల్స్ ద్వారా తన కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. మంగళగౌరి మదువె అనే సీరియల్ మంచి పేరు సంపాదించి పెట్టింది. ఆ సీరియల్ తెచ్చిపెట్టిన పాపులారిటీ వల్లే.. సినిమాల్లోనూ ఈమెకు ఆఫర్లు రావడం మొదలయ్యాయి.

Natural Star Nani: ‘దసరా’ లాంటి సినిమా మళ్లీ చేయను.. బాంబ్ పేల్చిన నాని

అయితే.. తనిషా ముందు నుంచే కొంచెం గ్లామర్ షో చేస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో ఘాటు ఫోటోషూట్‌లతో కుర్రకారు మతి పోగొడుతుంటుంది. సినిమాల్లోనూ హాట్ అవతారాల్లో కనిపించింది. అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల్లోనూ.. తన సెక్సీ ఫిగర్‌తో అందరినీ మైమరిపించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో.. ఈమెకు కర్ణాటకలో సెక్సీ క్వీన్‌గా పేరొచ్చింది. అయితే.. ఇక్కడో విషయం మనం అర్థం చేసుకోవాలి. అందాలు ఆరబోసినంత మాత్రాన, ఆ నటి దేనికైనా తెగిస్తుందనుకుంటే మాత్రం పప్పులే కాలేసినట్టే! కేవలం వృత్తిపరంగా మాత్రమే అందాలు ఆరబోస్తారు. ఈ విషయం అర్థం చేసుకోని ఒక యూట్యూబర్.. తనిషా పట్ల కొంచెం ఓవర్‌గా బిహేవ్ చేశాడు. ఆమెని ఇంటర్వ్యూ చేసిన ఆ యూట్యూబర్.. మీరు బ్లూ ఫిల్మ్స్‌లో నగ్నంగా నటిస్తారా? అని ప్రశ్నించాడు. అంతేకాదు.. మీరు చేయాల్సింది కన్నడ సినిమాలు కాదని, బ్లూ ఫిల్మ్స్ అని పేర్కొన్నాడు. దీంతో ఆక్రోశానికి గురైన తనిషా.. తాను బ్లూ ఫిల్మ్స్‌లో నటించే నటిని కాదంటూ ఘాటుగా బదులిచ్చింది.

Manisha Koirala: భర్తే శత్రువయ్యాడు, ఆరు నెలలకే అలా జరిగింది.. మనీషా షాకింగ్ కామెంట్స్

Exit mobile version