Tammareddy Bharadwaja: టాలీవుడ్ నిర్మాత, నటుడు తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాతగా ఆయన ఎన్నో మంచి హిట్స్ ను టాలీవుడ్ కు అందించారు. ఇక ఇండస్ట్రీలోని కొన్ని సమస్యలపై ఆయన ఎప్పుడు తన గొంతును వినిపిస్తారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆయన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. తాజాగా తమ్మారెడ్డి, లైగర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని అందుకొంది.
ఇక ఈ సినిమాపై తమ్మారెడ్డి మాట్లాడుతూ ” ఊరికే ఎగిరెగిరి పడకూడదు.. దేశాన్ని తగలెడతాం.. ఊరిని తగలెడతాం అంటే ప్రేక్షకులు మనల్ని తగలెడతారు. సినిమా తీశామంటే.. బాబు మేము సినిమా చేశాం చూడండి అని ప్రేక్షకులను అడగాలి. ఇలా చిటికెలు వేస్తూ చెప్తే.. వారుకూడా చిటికెలు వేస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పూరి గురించి మాట్లాడుతూ “నాకు మొదటి నుంచి పూరి సినిమాలు అంటే చాలా ఇష్టం.. కానీ లైగర్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే నేను సినిమా చూడలేదు.. చూడాలని కూడా అనిపించలేదు. ట్రైలర్ చూశాకా ఈ సినిమా అస్సలు సినిమా చూడాలనిపించలేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమ్మారెడ్డి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఏదిఏమైనా ఆయన చెప్పినదాంట్లో కూడా నిజం లేకపోలేదు అని కొందరు అంటుండగా.. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి.. మంచి హిట్ ఇస్తే మళ్లీ నార్మల్ అయిపోతుంది అని మరికొందరు అంటున్నారు.
