Tammareddy Bharadwaja: దేశాన్ని తగలెడతా అంటే మనల్ని తగలెడతారు.. విజయ్ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammareddy Bharadwaja: టాలీవుడ్ నిర్మాత, నటుడు తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాతగా ఆయన ఎన్నో మంచి హిట్స్ ను టాలీవుడ్ కు అందించారు. ఇక ఇండస్ట్రీలోని కొన్ని సమస్యలపై ఆయన ఎప్పుడు తన గొంతును వినిపిస్తారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆయన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. తాజాగా తమ్మారెడ్డి, లైగర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని అందుకొంది.
ఇక ఈ సినిమాపై తమ్మారెడ్డి మాట్లాడుతూ ” ఊరికే ఎగిరెగిరి పడకూడదు.. దేశాన్ని తగలెడతాం.. ఊరిని తగలెడతాం అంటే ప్రేక్షకులు మనల్ని తగలెడతారు. సినిమా తీశామంటే.. బాబు మేము సినిమా చేశాం చూడండి అని ప్రేక్షకులను అడగాలి. ఇలా చిటికెలు వేస్తూ చెప్తే.. వారుకూడా చిటికెలు వేస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పూరి గురించి మాట్లాడుతూ “నాకు మొదటి నుంచి పూరి సినిమాలు అంటే చాలా ఇష్టం.. కానీ లైగర్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే నేను సినిమా చూడలేదు.. చూడాలని కూడా అనిపించలేదు. ట్రైలర్ చూశాకా ఈ సినిమా అస్సలు సినిమా చూడాలనిపించలేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమ్మారెడ్డి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఏదిఏమైనా ఆయన చెప్పినదాంట్లో కూడా నిజం లేకపోలేదు అని కొందరు అంటుండగా.. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి.. మంచి హిట్ ఇస్తే మళ్లీ నార్మల్ అయిపోతుంది అని మరికొందరు అంటున్నారు.
Also Read
- Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
- Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
- Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
- Ravi Teja -Vivek : రవితేజ - వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
తాజావార్తలు
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!