Site icon NTV Telugu

Vijay TVK Party: 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా విజయ్ పార్టీ తొలి సమావేశం

Vijay Party Meeting

Vijay Party Meeting

Vijay TVK Meeting: నటుడు విజయ్ తమిళ చిత్రసీమలో సుప్రీమ్ స్టార్. పలు చిత్రాల్లో నటించిన విజయ్ కి అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై కొన్నేళ్లుగా పుకార్లు రావడంతో ఫిబ్రవరి 2న విజయ్ అధికారిక ప్రకటన చేశారు. విజయ్ ప్రారంభించిన పార్టీ పేరును తమిళనాడు వెట్రి కజగంగా ఎంపిక చేశారు. అదే సమయంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు లేదని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో ఈరోజు తమిళనాడు సక్సెస్ క్లబ్లో నిర్వాహకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వం, అంతర్గత పార్టీ నిర్మాణ విస్తరణపై సమాలోచనలు జరిగినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా అధ్యక్షులు ఈ భేటీలో పాల్గొన్నారు. చెన్నై శివారులోని పణయూర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగగా జిల్లా అధ్యక్షులు, పార్టీ కి సంబంధించిన ముఖ్య విభాగాలకు చెందిన నాయకులతో నటుడు విజయ్ సమావేశం అయ్యారు.

K Viswanath: కె.విశ్వనాథ్ వర్ధంతి.. ఆయన పేరుతో అవార్డులు ప్రకటించిన ఫ్యామిలీ

పార్టీ లో నూతన సభ్యత్వ నమోదు , క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల ఏర్పాటు పై కీలక చర్చ జరిగింది. 2026 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా విజయ్ బరిలోకి దిగి సంస్థాగతంగా పార్టీని బలోపేతం దిశగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నేటి మీటింగ్ కి పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్‌ అధ్యక్షత వహించారు. సభ ప్రారంభం కాగానే అందరూ పార్టీ ప్రతిజ్ఞ చేశారు. విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌కు అన్ని జిల్లాల్లో జిల్లా కార్యదర్శులు ఉన్నారు. వీరిలో మంచి పనితీరు కనబరిచే వారిని తమిళనాడు విజయ సంఘం జిల్లా అధ్యక్షులుగా కూడా నియమించే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ విస్తరణ, పార్టీని అన్ని రంగాల్లోకి తీసుకెళ్లే విషయంలో జిల్లాల నిర్వాహకులందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

Exit mobile version