NTV Telugu Site icon

Suriya: తండ్రితో విబేధాలు.. భార్యాబిడ్డలతో సహా బయటికి వెళ్ళిపోయిన సూర్య..?

Surya

Surya

Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లోఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటున్న వారిలో సూర్య కుటుంబం ఒకటి. తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీ కుటుంబాలతోనే సూర్య ఇప్పటివరకు జీవిస్తూ వస్తున్నాడు. ఇక పెద్ద కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన జ్యోతిక సైతం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చింది. మరిదిని, తోటికోడలిని సైతం సొంత బిడ్డలానే చూసుకుంటూ ఉమ్మడి కుటుంబాలకు ఆదర్శంగా నిలిచారు. అయితే గత కొన్నిరోజులుగా ఈ కుటుంబంలో కూడా విబేధాలు తలెత్తినట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తండ్రి శివ కుమార్ కు సూర్యకు మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఆయన తండ్రి కుటుంబం నుంచి విడిపోతున్నట్లు టాక్ నడుస్తోంది.

Raviteja: కోర్ట్ బోను ఎక్కిన రవితేజ.. ఏం తప్పు చేశాడు..?

ఇకపోతే కుటుంబాన్ని వదిలి సూర్య తన భార్యాబిడ్డలతో ముంబైకు మకాం మార్చనున్నాడట. అయితే ఈ వార్త ఎప్పుడో వచ్చినా ఇందులో నిజం లేదని అనుకున్నారు అందరు.. కానీ, ముంబైలో సూర్య రూ. 70 కోట్లు పెట్టి ఒక లగ్జరీ హౌస్ ను కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియా కూడా చెప్పడంతో ఈ వార్తలో నిజం ఉందని తెలుస్తోంది. ప్రముఖులు నివసించే జూహూ ఏరియాలో ఈ ఇల్లు ఉందట. పిల్లలకు పార్క్, జిమ్, గేటెడ్ కమ్యూనిటీతో దాదాపు 9 వేల చదరపు అడుగుల ఇల్లును సూర్య కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో భార్య జ్యోతికతో ఆయన ఆ ఇంట్లో గృహప్రవేశం చేయనున్నారట. ఇక ఈ వార్త తెలియడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంబైకు వెళితే.. సూర్య కోలీవుడ్ లో కనిపించాడా..? సినిమాలు చేయడా..? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయమై సూర్య ఎలా స్పందిస్తాడో చూడాలి.

Show comments