NTV Telugu Site icon

Gayathri Raghuram: బీజేపీకి గుడ్ బై చెప్పిన హీరోయిన్..

Gayatri

Gayatri

Gayathri Raghuram: తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా బీజేపీలో ముసలం మొదలయ్యింది. దీంతో బీజేపీ నుంచి ఒక మహిళా నేత తప్పుకుంది. మంగళవారం ఆమె బీజేపీ కి రాజీనామా చేసింది. ఆమె ఎవరో కాదు తమిళ నటి గాయత్రీ రఘురాం. గాయత్రి తమిళనాడు రాజకీయాల్లో చాలా చురుకుగా పాల్గొనేది. దీంతో ఆమెను బీజేపీ సాదరంగా ఆహ్వానించింది. ఇక అప్పటినుంచి ఆమె బీజేపీ కార్యకలాపాల్లో యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. అయితే గతేడాది నవంబర్ లో గాయత్రిని.. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.. పార్టీకి వ్యతిరేకంగా గాయత్రి కార్యకలాపాలు సాగిస్తోందని, ఆమెను ఆరునెలల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆదేశించారు. ఇంకా ఆరునెలలు పూర్తికాకముందే ఆమె కఠిన నిర్ణయాన్ని తీసుకోంది.

పార్టీలో మహిళలకు రక్షాన లేదని, అలాంటి చోట తాను ఉండనని తెలుపుతూ బీజేపీ కి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. భారమైన నా హృదయంతో ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాను. అన్నమలై సారథ్యంలో మహిళలకు రక్షణ లేదు, సమానత్వం లేదు, ప్రాధాన్యత లేదు. దీనికన్నా బయట నుంచి ట్రోల్ చేయడం నాకు మంచిదనిపించింది. హిందూ దర్మం నా హృదయం.. ఒక రాజకీయ పార్టీలో దాన్ని వెతకాల్సిన అవసరం నాకు లేదు. దీనికన్నా గుడికి వెళ్లి.. దేవుడు వద్ద ధర్మం కోసం అన్వేషిస్తాను. దేవుడు ఎక్కడైనా ఉంటాడు. న్యాయం ఆలస్యమైతే.. న్యాయం చేయడానికి నిరాకరించినట్లే” అంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.