Site icon NTV Telugu

Meera Mithun: హీరోయిన్ నోటిదూల.. అరెస్ట్ వారెంట్ జారీ

meera mithun

meera mithun

కోలీవుడ్ హీరోయిన్ మీరా మిథున్ మరోసారి వార్తల్లో నిలిచింది. అమ్మడికి వివాదాలేమి కొత్తకాదు.. సోషల్ మీడియాలో ఏది అనిపిస్తే అది మాట్లాడి వివాదాలను కొనితెచ్చుకొనే ఈ భామపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటించిన మీరా.. తనకు అవకాశాలు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని, అందులో షెడ్యూల్ కులస్థులు కూడా ఉన్నారని, వారిని వెంటనే సినీ ఇండస్ట్రీ నుంచి తప్పించాలంటూ వారిని, వారి కులాన్ని కించపరుస్తూ గతంలో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారిన విషయం తెల్సిందే. ఈ వీడియో వైరల్ కావడంతో దళిత సామాజిక వర్గం నుంచి ఆందోళనలు మొదలయ్యాయి.

ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్ 153 153 ఎ(1) 505 (1) (బి) 505(2) మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద అనేక కేసులు నమోదు చేశారు. ఆ తరువాత అమ్మడిని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు షాక్ ఇస్తూ తనను అరెస్ట్ చేయడానికి తనపై చెయ్యి వేస్తే ఆత్మహత్య చేసుకుంటానని తమిళనాడు సీఎం స్టాలిన్ కి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనపై పోలీసులు అఘాయిత్యానికి పాల్పడుతున్నారని, తన వద్ద ఉన్న ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తున్నారని, తనను అరెస్ట్ చేసే హక్కు ఎవరికి లేదని తెలుపుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది. అది ఏకంగా కోలీవుడ్ నే కుదిపేసింది. ఇక చాలా రోజుల తర్వాత మీరా కేసుపై చెన్నై కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటివరకు ఆమె ఒక్క విచారణకు కూడా హాజరు కానందున ఆమెను అరెస్ట్ చేసి వచ్చేనెల 4 వ తేదీన కోర్టులో హాజరపర్చాల్సిందిగా పోలీసులకు ఆదేశించింది. మరి ఈసారి అమ్మడు ఎంత హంగామా చేస్తుందో చూడాలి అంటున్నారు కోలీవుడ్ వర్గాలు.

Exit mobile version