కోలీవుడ్ హీరోయిన్ త్రిష చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది. జూన్ 22న విజయ్ బర్త్ డే సందర్భంగా హ్యాపీ బర్త్ డే బెస్టెస్ట్ అని హగ్ సింబల్ జత చేసి విజయ్ తో పక్క పక్కనే కూర్చున్న పిక్ షేర్ చేసింది త్రిష. అంతేనా ఈ ఫోటోకు త్రిష తల్లి సైతం లవ్ సింబల్స్ జోడించి ఇన్ స్టా స్టోరీ పెట్టింది. దాంతో త్రిష, విజయ్ మధ్య లవ్ అఫైర్ ఉందని నెటిజన్స్ వీరిని లవర్స్ గా కన్ఫామ్ చేసారు. ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని చాలా కాలం వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ ఇద్దరు ఎప్పుడు వాటిని ఖండించలేదు.
Also Read : Hero Sriram : అవును.. నేను డ్రగ్స్ తీసుకున్నాను.. బెయిల్ ఇవ్వండి
విజయ్ అండ్ త్రిష లవ్ బర్డ్స్ అంటూ ఇప్పటి నుండే కాదు.. ఎప్పటి నుండో గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కలిసి జర్నీ చేయడం, కీర్తి సురేష్ పెళ్లికి గోవా వెళ్లడం కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్ చేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్లీ గుడ్ పీపుల్, గుడ్ టైమ్స్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది త్రిష. బర్త్ డే రోజు విజయ్ కుక్క పిల్లని ఎత్తుకున్న ఫోటో షేర్ చేసింది. కుక్క పిల్లను ఈ ఏడాదే ఫిబ్రవరిలో త్రిష దత్తత తీసుకుంది. అంటే ఆ ఫోటో రీసెంట్ గా తీసుకుంది. ఇద్దరు కలిసి త్రిష ఇంట్లో పార్టీ చేసుకున్నారన్న టాక్ నడుస్తోంది. త్రిష, విజయ్ 2004లో గిల్లీ సినిమాలో తొలిసారి జతకట్టారు. 2006లో ఆదితో పాటు రీసెంట్లీ లియోలోను కలిసి నటించారు. తన 25 సంవత్సరాల కెరీర్లో ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్ చేయని త్రిష గోట్‌లో విజయ్ కోసం నర్తించింది. దీంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే చర్చకు బలం చేకూరింది. మరి ఈ వార్తలపై ఈ సీనియర్ జోడి స్పందిస్తుందో లేదో చూడాలి