Bharathi Raja:కోలీవుడ్ దర్శక దిగ్గజం భారతీ రాజా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం కడుపునొప్పితో ఆయన చెన్నైలోనో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, రెండు రోజులు వైద్యుల సంరక్షణలో ఉంచాలని చెప్పారు. తెలుగు, తమిళ్ లో భారతీ రాజా గురించి కానీ, ఆయన తీసిన సినిమాల గురించి కానీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కల్డ్ క్లాసిక్ గా నిలిచిపోయే చిత్రాలను ఇండస్ట్రీకి ఇచ్చారు.
సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని లాంటి చిత్రాలు తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాయి. ప్రస్తుతం దర్శకుడిగా బ్రేక్ తీసుకున్న ఆయన అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో నటుడిగా కనిపిస్తున్నారు. ఇటీవలే ధనుష్ నటించిన తిరు చిత్రంలో ధనుష్ తాతగా కనిపించి మెప్పించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
