Lubna Ameer: కోలీవుడ్ నటి లుబ్నా అమీర్.. మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తన ప్రియుడు తనను వేధిస్తున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇది మొదటిసారి కాదు.. ఆమె ఇలా చేయడం రెండోసారి అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అస్సలు అంతలా ఆమె ప్రియుడు ఎందుకు వేధించాడు..? ఆమె యేమని ఫిర్యాదు చేసింది అంటే… కోలీవుడ్ లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి గుర్తింపునే తెచ్చుకుంది లుబ్నా అమీర్. ఆమెకు కొన్నేళ్ల క్రితం ఒక డేటింగ్ యాప్ ద్వారా.. మాసిఉల్లా అనే ఐటీ ఉద్యోగి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇలా రెండేళ్లు గడిచిపోయాయి. అయితే మాసిఉల్లా గురించి లుబ్నా అమీర్ కు నిజం తెల్సింది. అతడికి ఆల్రెడీ పెళ్లి అయ్యిందని, కుటుంబం, పిల్లలు కూడా ఉన్నారని తెలియడంతో అతడిని దూరం పెట్టింది. అప్పటినుంచి తనను మాజీ ప్రియుడు వేధిస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చింది.
Rajinikanth: సినిమాలకు సూపర్ స్టార్ గుడ్ బై..?
ఇక ఈ విషయమై గతంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు చెప్పుకొచ్చింది. అప్పుడు కొద్దిగా సైలెంట్ గా ఉన్న అతను మళ్లీ వేధించడం మొదలుపెట్టాడని చెప్పుకొచ్చింది. తనతో గడిపిన ఫోటోలు, వీడియోలు చూపించి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది. ఇక ఆమె ప్రియుడు మాసిఉల్లా ఆరోపణలు వేరుగా ఉన్నాయి. లుబ్నా అమీర్ డబ్బుకోసం ఎంతటి నీచమైన పనులు అయినా చేస్తుందని, బట్టలు విప్పి.. పోర్న్ లో నటిస్తూ డబ్బు సంపాదిస్తుందని చెప్పుకొచ్చాడు. ఆ విషయమై తాము నిత్యం గొడవ పడతామని అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆమె తన పంథా మార్చుకోవడం లేదని, ఆ పనిని మానేయమని తనతో గొడవపడుతున్నట్లు అతను చెప్పుకొచ్చాడు. ఇక నటి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
