కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఉదయం జిమ్ చేస్తుండగా సడెన్ హార్ట్ స్ట్రోక్ రావడంతో పునీత్ మృతిచెందారు. పునీత్ మరణాన్ని కన్నడ ఇండస్ట్రీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇప్పటికే స్టార్ హీరోలందరు పునీత్ ఇంటికి వెళ్లి ఆయనకు నివాళులర్పిస్తున్నారు.
ఇటీవలే రామ్ చరణ్, హీరో శివ కార్తికేయన్ పునీత్ సమాధివద్ద నివాళులర్పించగా.. తాజాగా హీరో సూర్య పునీత్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ సమాధి వద్దకు సూర్య.. ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. ” పునీత్ లేడన్న విషయం నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా.. రాజ్ కుమార్ ఫ్యామిలీకి, మా ఫ్యామిలీ ఒక గొప్ప స్నేహ బంధం ఉంది. పునీత్ వాళ్ళ అమ్మ, మా అమ్మ ఇద్దరూ గర్భవతులుగా ఉన్నప్పుడు కలిశారంట.. మేమిద్దరం కడుపులో ఉన్నప్పుడే ఒకరికొకరు పరిచయం చేసుకున్నాం” అంటూ భావోద్వేగానికి లోనైయ్యారు. అనంతరం పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. పునీత్ అంత్యక్రియలకు రాలేని నటీనటులంతా ఆ తర్వాత స్వయంగా పునీత్ రాజ్‌కుమార్ ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
