Kavin: కెవిన్ కవల పిల్లలకు ఆ పేర్లు.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavin: సినిమా సక్సెస్, కొత్త ప్రాజెక్టులు, వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తమిళ హీరో కెవిన్ తన అభిమానులతో మరో శుభవార్త పంచుకున్నారు. ఇప్పటికే తండ్రిగా మారిన విషయాన్ని వెల్లడించిన ఆయన, తాజాగా తన కవల పిల్లలకు పెట్టిన పేర్లను కూడా బయటపెట్టారు. ఒక బాబు, ఒక పాపకు తల్లిదండ్రులుగా మారిన కవిన్, మోనికా దంపతులు తమ పిల్లలకు థియోలినా కెవిన్ , థియాన్ లియో కెవిన్ అనే పేర్లు పెట్టారు. పిల్లల పాదాల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ పేర్లను కెవిన్ వెల్లడించడంతో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కెవిన్ తన పిల్లల పేర్లను సెప్టెంబర్ 3న సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. పిల్లల పాదాల ఫొటోలను షేర్ చేసిన ఆయన, దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ పిల్లలకు థియోలినా కవిన్, థియాన్ లియో కవిన్ అని పేర్లు పెట్టినట్లు వెల్లడించారు. ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్‌గా మారింది. తమ అభిమాన హీరో జీవితంలో ఇంత ముఖ్యమైన సందర్భం రావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
అంతకుముందు జూలై 30న కెవిన్ తాను కవలలకు తండ్రైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఒకేసారి తమ జీవితాల్లోకి ఇద్దరు చిన్నారులు రావడంతో తమ ఆనందం రెట్టింపైందని ఆయన పేర్కొన్నారు. తమకు ఒక బాబు, ఒక పాప జన్మించారని అప్పట్లో వెల్లడించారు. అయితే పిల్లలకు ఏ పేర్లు పెట్టారనే విషయాన్ని మాత్రం అప్పట్లో వెల్లడించలేదు. తాజాగా ఆ పేర్లను కూడా ప్రకటించడంతో కెవిన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ శుభవార్త మరోసారి వార్తల్లో నిలిచింది.
కెవిన్ , మోనికా డేవిడ్ 2023 ఆగస్టు 20న వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. మోనికా ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో పంచుకోని కవిన్, తన పిల్లల జననం, పేర్ల విషయాన్ని మాత్రం అభిమానులతో పంచుకోవడం విశేషంగా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే కెవిన్ ప్రస్తుతం కెరీర్లో కీలక దశలో ఉన్నారు. ఆయన హీరోగా నటించిన ‘హాయ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతారతో కలిసి కవిన్ నటించిన ఈ మూవీకి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించారు. రచయితగా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ఎడవన్కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. నయనతార, విఘ్నేష్ శివన్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ ఆగస్టు 28న రిలీజ్ అయింది. యావరేజ్ టాక్ తో ఈ మూవీ నడుస్తోంది.
ఈ సినిమాలో కెవిన్ , నయనతారతో పాటు ప్రభు, రాధిక శరత్‌కుమార్, కె. భాగ్యరాజ్, పూర్ణిమ భాగ్యరాజ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ‘హాయ్’తో పాటు కెవిన్ చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం తాత్కాలికంగా ‘కెవిన్ 09’గా పిలుస్తున్న ఫాంటసీ రొమాంటిక్ కామెడీలో ఆయన ప్రియాంక అరుల్ మోహన్, శాండీ మాస్టర్‌తో కలిసి నటించనున్నారు.
ఒకవైపు హీరోగా వరుస సినిమాలతో తన మార్కెట్‌ను పెంచుకుంటున్న కవిన్, మరోవైపు ఇప్పుడు తండ్రిగా కొత్త బాధ్యతలను స్వీకరించారు. థియోలినా కవిన్, థియాన్ లియో కవిన్ అనే ఇద్దరు చిన్నారులతో తమ కుటుంబంలోకి వచ్చిన ఈ రెట్టింపు ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీంతో కవిన్ జీవితంలో 2026 సంవత్సరం సినిమాల పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయింది.
- Tags
- cinema
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!