NTV Telugu Site icon

Hero Babu: హీరో మృతి.. తట్టుకోలేక ఆగిన తల్లి గుండె

Babu

Babu

Hero Babu: కోలీవుడ్ సీనియర్ హీరో బాబు సెప్టెంబర్ 19న మృతి చెందిన విషయం తెల్సిందే. మనసారా వస్తుంగళెన్‌ అనే సినిమా కోసం డూప్ లేకుండా రిస్క్ చేసి ఫైట్ సీన్ లో ఎత్తైన ఒక ప్రదేశం నుంచి కిందకు దూకాడు. ఆ ఘటనలో ఆయన ప్రాణాలను మాత్రమే దక్కించుకోగలిగాడు. శరీరం మొత్తం జీవచ్ఛవంలా మారిపోయింది. ఇది జరిగి 30 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి బాబును ఆమె తల్లి ప్రేమ.. కన్నకొడుకును కంటికి రెప్పలా చూసుకొంటుంది. వెన్నుముక విరిగిపోవడంతో బాబు నడవలేని పరిస్థితి.. అయినా కూడా అతనిని ఎంతో ప్రేమగా చూసుకుంది ప్రేమ. అదే కదా తల్లిప్రేమ అంటే. ఇక దాదాపు 30 ఏళ్లు బాబును చూసుకున్న ఆమె.. కొడుకు చనిపోయాక బతకలేకపోయింది.

Bandla Ganesh: పవన్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. వీడియో రిలీజ్ చేసిన బండ్లన్న

కొడుకు జీవచ్ఛవంలా ఉన్నా కూడా.. బతికి ఉన్నాడు చాలు అని అనుకుంది. అలానే కొడుకుకు సపర్యలు చేస్తూ వస్తుంది. ఇక కొడుకు చనిపోయాడని తెలిసాకా.. ఆమె తట్టుకోలేకపోయింది. బాబు కోసమే కంటతడి పెడుతూ నిద్రాహారాలు మానేయడంతో ప్రేమ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ క్రమంలో అస్వస్థతకు లోనైన ప్రేమ అక్టోబర్‌ 11న కన్నుమూసింది. కొడుకు చనిపోయిన మూడు వారాలకే తను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఈ విషయాన్నీ బాబు కుటుంబ సభ్యులు అధికారికంగా తెలిపారు. దీంతో ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తల్లి ప్రేమ అంటే ఇదేనేమో అని చెప్పుకొస్తున్నారు. బాబు తన కెరీర్ లో 10 సినిమాల్లో నటించాడు. అతడి మొదటి సినిమా ఎన్‌ ఉయిర్‌ తొళన్‌. ఈ సినిమాకు దర్శక దిగ్గజుడు భారతీరాజా దర్శకత్వం వహించాడు.