NTV Telugu Site icon

Tamannah: వివాదంలో తమన్నా.. 7వ తరగతి విద్యార్థులకి పాఠంగా జీవిత చరిత్ర?

Tamannah says 'morning saliva' actually works on skin

Tamannah Story in Text Book Controversy in Hebbal Bengaluru: బెంగళూరు హెబ్బల్‌లోని సింధీ కాలేజీలో, నటి తమన్నాపై 7వ తరగతి విద్యార్థులకు అందించిన టెక్స్ట్ బుక్ వివాదానికి దారితీసింది. దీన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెంగళూరులోని హెబ్బాల్‌లోని సింధీ కాలేజీ ఈ వివాదానికి కారణమైంది. సింధీ కాలేజీ 7వ తరగతి పాఠ్యాంశంలో నటి తమన్నా గురించిన పాఠాన్ని చేర్చడం వివాదానికి దారితీసింది. తమన్నా పాఠాన్ని చేర్చడంపై పలువురు తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చిన పాఠ్యాంశాలు మీడియాలో కూడా ప్రసారమయ్యాయి. సింధీ కాలేజ్ ఎక్స్‌ట్రా కరిక్యులర్‌లో తమన్నాపై పాఠం చేర్చబడింది. దాని యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సింధీ కమ్యూనిటీకి తెలియజేసే ముఖ్యమైన విషయాలు రాసిన చోటే తమన్నా యొక్క పాఠం చేర్చబడింది. తమన్నా పుట్టిన తేదీ, తమన్నా చేసిన సినిమాల వివరాలు పాఠంలో ఇవ్వబడ్డాయి.

Vengal Rao: దారుణమైన స్థితిలో కమెడియన్.. శింబు ఆర్థిక సహాయం

సింధు సంఘం అనుకూలతలను పరిచయం చేయడానికి ఆమె గురించి ప్రచురించి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఈ పాఠం 7వ తరగతి విద్యార్థులకు ఇవ్వబడుతుంది. తెలుగు మరియు తమిళంలో నటి చేసిన సినిమాలు మరియు ఆమె నటన గురించి టెక్స్ట్ లో పేర్కొన్నారు. సింధ్ విభజన తర్వాత జీవితం. తమన్నా యొక్క టెక్స్ట్ మైగ్రేషన్, కమ్యూనిటీ అండ్ కాన్ఫ్లిక్ట్ పేరుతో ఉంది. ఇక ఈ పాఠంలో బాలీవుడ్ నటుడు రణబీర్ సింగ్ గురించి కూడా మెన్షన్ చేశారు. తమన్నా గురించి పాఠంలో చేర్చడంపై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మా పిల్లలు ఆమె గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అలాంటి నటి నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారని ప్రశ్నించారు. తమన్నా పోర్న్ తరహా చిత్రాల్లో నటించిందని, పిల్లలు కూడా ఆమె గురించి మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారని తల్లిదండ్రులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై యాజమాన్య బోర్డును ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై తల్లిదండ్రులు బాలల హక్కుల కమిషన్‌, ప్రైవేట్‌ పాఠశాలల సమాఖ్యకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Show comments