Site icon NTV Telugu

Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై పోటీకి దిగుతున్న తమన్నా

Pawan Kalyan

Pawan Kalyan

Tamannah Simhadri to Contest on Pawan Kalyan at Pithapuram: సరిగ్గా నెల రోజుల్లో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ వైసిపి అభ్యర్థిగా వంగా గీత బరిలో ఉండగా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే ఉండనుంది అని అందరికీ దాదాపుగా అర్థం అయిపోయింది. పవన్ కళ్యాణ్ ని ఎలా అయినా గెలిపించాలని కూటమి ప్రయత్నిస్తుంటే ఎలా అయినా ఓడించాలని అధికార వైసీపీ తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఒక ఆసక్తికరమైన పరిణామం తెరమీదకు వచ్చింది. పవన్ కళ్యాణ్ మీద పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన తమన్నా సింహాద్రి ట్రాన్స్ జెండర్ గా మారి సినీ రంగంలో అవకాశాల కోసం హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు.

Vijay Deverakonda: హ్యాపెనింగ్ హీరోయిన్ పై కన్నేసిన విజయ్.. నెక్స్ట్ మూవీ ఆమెతోనే?

తనకి ఉన్న కాంటాక్ట్స్ తో ఆమె గతంలో ఒక బిగ్ బాస్ సీజన్ లో కూడా పాల్గొని వివాదాస్పద కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుని తర్వాత హౌస్ లో నుండి బయటకు వచ్చేసింది. 2019 ఎన్నికల్లో ఆమె మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ మీద అప్పట్లో కంటెస్ట్ చేసి డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయింది. అయితే గతంలో జనసేన తరఫున కొన్నాళ్లపాటు ప్రచారానికి వెళ్లిన ఆమె ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఆయన మీదే పోటీకి దిగటం హాట్ టాపిక్ అవుతుంది. మంగళగిరిలో లోకేష్ మీద ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగగా ఈసారి మాత్రం ఒక పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు. పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ స్థాపించిన భార‌త చైత‌న్య యువ‌జ‌న పార్టీ (బీసీవై) నుంచి ఆమె అక్కడ పోటీ చేయ‌నున్న‌ట్టు రామ‌చంద్ర‌యాద‌వ్ ప్ర‌క‌టించారు. ప్రస్తుత అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నేత సింహాద్రి రమేష్ తనకు బాబాయ్ వరస అవుతాడని గతంలో పలుసార్లు తమన్నా సింహాద్రి పేర్కొన్నారు.

Exit mobile version