Site icon NTV Telugu

Tamannaah : వాళ్ల మీద చేతబడి చేస్తా.. తమన్నా షాకింగ్ కామెంట్స్

Tamannah

Tamannah

Tamannaah : తమన్నా ఇప్పుడు ఓదెల-2 సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. నిన్న ముంబైలో రిలీజ్ అయిన ట్రైలర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఇందులో తమన్నా పాత్ర గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఆమె ఇందులో నాగసాధువుగా నటిస్తోంది. ఏప్రిల్ 17న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో యాంకర్ ఓ ప్రశ్న వేసింది. మీకు చేతబడి వస్తే ఎవరిపై విజయం సాధించడానికి చేస్తారు అంటూ.. ఇన్ డైరెక్ట్ గా విజయ్ వర్మను ఉద్దేశించి అడిగింది. దానికి తమన్నా స్పందిస్తూ క్రేజీ ఆన్సర్ ఇచ్చింది. నాకు అలాంటి వాటిపై పెద్దగా నమ్మకం లేదని తెలిపింది.

Read Also : Aditya 369: ‘బాలయ్య’ని ఫాన్స్ కూడా లైట్ తీసుకున్నారా?

‘మంత్రాలు, తంత్రాలకు ఏమైనా జరుగుతాయా అంటే నేను నమ్మను. ఒకవేళ నిజంగా వాటికి అంత శక్తులు ఉంటే కచ్చితంగా మీడియా మీదనే చేతబడి చేస్తాను. అప్పుడు అందరూ నా కంట్రోల్ లోనే ఉంటారు. నేను చెప్పిందే రాస్తారు. నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఇక పర్సనల్ లైఫ్‌ లో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపింది. తనకు అనుకున్నవి అన్నీ సాధించే శక్తిని దేవుడు ఇచ్చాడని చెప్పుకొచ్చింది. ఓదెల-2లో నాగసాధువు పాత్ర చేయడం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఇలాంటి పాత్ర రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా మరో ఎత్తు అని చెప్పింది. ఓదెల-2 హర్రర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version