బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అంటే టక్కున గుర్తురాదేమో కానీ తమన్నా మాజీ అనగానే వెంటనే గుర్తొస్తాడు. నేచురల్ స్టార్ నాని నటించిన ఎంసిఏతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయయి మంచి మార్కులేయించుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో తన నటనకంటే కూడా తమన్నాతో ప్రేమలో మునిగి తేలుతూ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. కొంతకాళం ఎక్కడ చుసిన ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తూ హాట్ హాట్ ఫోటోషూట్స్ తో హల్చల్ చేసింది ఈ జంట.
Also Read : Raashii Khanna : రాశి ఖన్నాకు హిట్ ఇచ్చే హీరో ఎవరు.?
త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనుకోగా బ్రేకప్ చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన తమ్ము బ్రేకప్ నుండి కోలుకోవడానికి కాస్త టైమ్ పట్టింది. కానీ ఆమె మాజీ ప్రేమికుడు విజయ్ వర్మ మాత్రం బ్రేకప్ ను కూడా బ్రేక్ చేసి మరోక హీరోయిన్ ను లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడు. కాదు లైన్ లో పెట్టేసాడు ఈ సారి ఇంకో వైట్ బ్యూటీని పట్టేసాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సారి మరొక బాలీవుడ్ బ్యూటీ దంగల్ సినిమాలో అమిర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్ తో డేటింగ్ చేస్తున్నాడట. వీరిద్దరూ కలిసి గుస్తాఖ్ ఇష్క్ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే ఇద్దరికి పరిచయం అయిందని అప్పటి నుండి ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ వర్గాల గుసగుస. ఎంతో సిన్సియర్ గా ప్రేమిచిన తమన్నాతో బ్రేకప్ చెప్పి మరొక హీరోయిన్ తో చెట్టాపట్టలేసుకుని తిరుగుతున్న విజయ్ పై గరంగరం అవుతున్నారు తమన్నా ఫ్యాన్స్.
