NTV Telugu Site icon

Tamannaah: శృంగారం హీరోలు చేస్తే స్టార్లు అవుతారు.. హీరోయిన్స్ చేస్తే క్యారెక్టర్ జడ్జ్ చేస్తారు..

Tamanna

Tamanna

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా పేరు ఇప్పుడు వినిపిస్తున్నంత ఎక్కువగా ఇప్పటివరకు వినిపించింది లేదు. అంతగా ఆమె పేరు వినిపించడానికి కారణం.. అనే నటిస్తున్న సిరీస్ లే. బాలీవుడ్ కు వెళ్లిన ఈ భామ అక్కడ జో ఖర్దా, లస్ట్ స్టోరీస్ లాంటి సిరీస్ లలో కనిపించింది. మునుపెన్నడూ లేనంత అందాల ఆరబోత, ఘాటు సీన్స్లు, ఇంటిమేటెడ్ సీన్లు చేసి.. దేవుడా.. ఈమె తమన్నానేనా అని అనిపించింది. ఆ రెండు సిరీస్ ల వలన తమన్నాను నెటిజన్లు ఏకిపారేసే స్థాయికి వచ్చారు. ఇక తాజాగా ఈ విమర్శలకు తమన్నా సమాధానం చెప్పింది. తాజాగా తెలుగు యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన మనసులోని భావాలను బయటపెట్టింది. ఎందుకు ఇలాంటి సీన్స్ చేయాల్సి వచ్చింది.. అనేది కూడా ఆమె చెప్పుకొచ్చింది.

Ravi Kishan: ఆర్మీలో చేరిన రేసుగుర్రం విలన్ కుమార్తె.. ఫిదా అవుతున్న నెటిజన్స్

తమిళ్ లో చేసినంత ప్రయోగాత్మకమైన పాత్రలు తెలుగులో చేయలేదు అంటే .. ఇక్కడ అలాంటి పాత్రలు ఎవ్వరు రాయలేదని చెప్పుకొచ్చింది. ” నేను చాలా సార్లు గమనించాను. డబుల్ స్టాండర్డ్స్ అందరి హీరోలు.. ప్రతి సినిమాలో వైలెన్స్ చేస్తారు.. ఇంటిమేటెడ్ సీన్స్ చేస్తారు. దాని వలన ఎంతో స్టార్స్ అయిపోతున్నారు. కానీ, అదే హీరోయిన్లు చేస్తే మాత్రం తప్పు పడుతున్నారు. ఈ ట్విట్టర్ అంకుల్స్ .. వాళ్లకున్న ఒపీనియన్స్ అన్ని అందులో చెప్పుకొస్తున్నారు. 2023 లో కూడా అమ్మాయిలు ఎలా ఉండాలి అని ఎందుకు చెప్తున్నారు. ఇక వారు చెప్పినవి మీడియా వారు థంబ్ నెయిల్స్ గా తీసుకొని ఆర్టికల్స్ రాసి బయటపెడుతున్నారు. నాకున్న బాధ ఏంటంటే.. ఎందుకు ఇదంతా అనిపిస్తూ ఉంటుంది. ఇంటిమేటెడ్ సీన్స్ హీరోలు చేస్తే స్టార్ హీరోలుగా మారుతున్నారు.. కానీ హీరోయిన్లు చేస్తే క్యారెక్టర్ ను తప్పు పడుతున్నారు.. ఎందుకు అని ఆమె ప్రశ్నించింది” ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం తమన్నా తెలుగులో భోళా శంకర్ చిత్రంలో చిరు సరసన నటిస్తోంది.

Show comments