NTV Telugu Site icon

Odela 2: తమన్నా నుంచి ఇలాంటిది ఊహించలేదే.. అలాంటి పాత్రలో అంటే..

Odela

Odela

Odela 2: మిల్కీ బ్యూటీ తమన్నా.. గ్లామర్ పాత్రలను కట్టిపెట్టి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెంచుతుంది. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు మంచి విజయాలనే అందుకున్నాయి. ఇక తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు తమ్ము బేబీ ఓకే చెప్పింది. హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ, వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటించిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా గుర్తుంది కదా. అశోక్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది కథను అందించాడు. 2022 లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఓదెల అనే గ్రామంలో కొత్తగా పెళ్లయిన ఆడవాళ్ళందరినీ చంపే సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. డీ గ్లామర్ రోల్ లో హెబ్బా పటేల్ నటించి మెప్పించింది. ఇక దాదాపు రెండేళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు సంపత్ నంది. ఓదెల 2 పేరుతో ఈ సీక్వెల్ రానుంది. ఓదెల రైల్వే స్టేషన్ లో నటించినవారితో పాటు తమన్నా కూడా యాడ్ అవుతుంది. ఆమె చుట్టూనే ఈ కథ నడుస్తుంది. అయితే ఇది సీక్వెల్ కాదని మేకర్స్ చెప్పుకురావడం విశేషం. తాజాగా ఇందుకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రివీల్ చేశారు.

ఓదెల మల్లన్న స్వామి ఒక గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి ఎలా రక్షించాడు. అందులో తమన్నా పాత్ర ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇలాంటి ఒక కథను తమ్ము సెలెక్ట్ చేసుకోవడం అనేది రిస్క్ అనే చెప్పాలి. తమన్నా డీ గ్లామర్ పాత్రలకు సెట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అందులోనూ దుష్టశక్తులు, గుడి అంటే కొంతవరకు భయపెట్టే అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలా భయపెట్టడం తమ్ముకు కొత్తేమి కాదు. అసలు ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ను తమ్ము నుంచి ఊహించలేదని అభిమానులు అంటున్నారు. మరి ఈ సినిమాతో తమన్నా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments