NTV Telugu Site icon

Tamannah: తమన్నాకు పిల్లలంటే భయం.. కారణం ఏంటో తెలుసా?

Tamannahthumb

Tamannahthumb

Tamannah Bhatia Fear on Having Kids: నటి తమన్నా భాటియా స్త్రీ 2 సినిమాలో ఆజ్ కీ రాత్ పాటలో కనిపించి సంచలనం సృష్టించింది. 34 ఏళ్ల తమన్నా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. ఈ మధ్యనే ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు మరోసారి తమన్నా పిల్లల గురించి తన అభిప్రాయాన్ని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. తమన్నాకు పిల్లలంటే భయం అట. తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పిల్లల గురించి ఎందుకు భయపడుతున్నానో చెప్పింది. ఒక పాడ్‌కాస్ట్‌లో తమన్నా భాటియా మాట్లాడుతూ, నేను తల్లి కావడానికి భయపడుతున్నాను. తల్లులు తమ సర్వస్వం తమ పిల్లలకు అందజేస్తారు. నేను పిల్లలకు అంత ప్రేమ, సంరక్షణ – శ్రద్ధ ఇవ్వలేను. నా తల్లిదండ్రులు నాకు ఎనలేని ప్రేమను ఇచ్చారు. వీళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే.. పేరెంటింగ్ లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇదంతా నేను చేయలేనని అనుకుంటున్నాను.

Sukumar- Dil Raju: నేనున్నా.. దిల్ రాజుకు సుక్కూ అభయం!

పిల్లలు పుట్టాక ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది’’ అని తమన్నా భాటియా అన్నారు. ఈ భయం చూస్తుంటే అసలు తమన్నాకి భవిష్యత్తులో పెళ్లవుతుందా? పిల్లలు పుడతారా అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది. ఇక అదే ఇంటర్వ్యూలో తమన్నా భాటియా మరిన్ని విషయాల గురించి మాట్లాడింది. వీడియో గేమ్‌లు ఆడేందుకు ఇష్టపడే తమన్నా స్కూల్‌లో నిజాయితీ గల అమ్మాయిగా ఉండేదట. చుట్టుపక్కల వారు ఏం చెప్పినా తమన్నా పట్టించుకోదని, మహిళలు ఆర్థికంగా దృఢంగా ఉండాలని, స్త్రీ ఏదైనా చేయగలదని తన నమ్మకం అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక రిలేషన్ షిప్ బాగుండాలంటే ఏం చేయాలి అనే ప్రశ్నకు తమన్నా సమాధానమిస్తూ మీ భాగస్వామి చెప్పేవి ప్రశాంతంగా వినండి. దీనివల్ల ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకుని ధైర్యం నింపుతారన్నారు. నేను మీతో ఉన్నాను, మీ పోరాటంలో నేను పాల్గొంటున్నాను, మీరు ఏమి చేసినా నేను మీకు అండగా ఉంటాను అని పార్ట్నర్ కి భరోసా కల్పించాలని తమన్నా భాటియా చెప్పింది. మరోపక్క తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో చాలా కాలంగా డేటింగ్ చేస్తోంది. ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంది. ఇద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నా వాళ్ళు అధికారికంగా చెబితే తప్ప నమ్మలేం.

Show comments