Site icon NTV Telugu

Tamannaah: ఇదుగో తమన్నా.. విజయ్ తో ఎఫైర్.. ఇక బయటపెట్టేయ్

Tamanna

Tamanna

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి గోల నెట్టింట వైరల్ గా మారింది. శ్రీ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మిల్కీ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సైతం నెగ్గుకు రావాలని చూస్తోంది. అయితే ఏ ముహూర్తాన అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందో.. అక్కడే ఒక బాయ్ ఫ్రెండ్ ని కూడా సెట్ చేసేసుకోంది. ఇప్పటివరకు తమన్నాకు ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చిందే లేదు. కానీ, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక ఆ వార్తలకు తగ్గట్టే ఈ జంట.. మీడియా ముందు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఇక న్యూయర్ రోజున అందరి ముందు లిప్ లాక్ పెట్టుకుంటూ మీడియా కంటపడ్డ ఈ జంట.. ఇక తాజాగా ముంబైలో లంచ్ డేట్ కు వెళ్తూ కనిపించారు.

ఇక ఎందుకు ఇంత నెగెటివిటీ.. స్నేహితులు అయ్యే ఉండొచ్చు కదా.. అంటే ఫ్రెండ్స్ అయితే ముద్దులు పెట్టుకుంటూ డేట్స్ కు వెళ్తారా..? అని మరికొందరు కౌంటర్లు వేస్తున్నారు. ఇక ఈ కౌంటర్లు భరించలేని తమన్నా ఫ్యాన్స్ మాత్రం.. ఇదుగో తమన్నా.. విజయ్ తో ఎఫైర్ ఉందా.. ఇక బయటపెట్టేయ్.. పెళ్లి చేసుకోబోతున్నారా..? చెప్పేయండి.. ఇలా రూమర్స్ రావడం మీకు నచ్చుతుందా..? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమన్నా, విజయ్ ల ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే తమన్నా ప్రస్తుతం చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.

Exit mobile version