Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమాయణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముప్ద్దుగుమ్మ.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్లు గత వారం నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక నిప్పులేనిదే పొగరాదు అన్నట్లు.. తమ్ము నిప్పు కాదు ఏకంగా మంటనే రగిలించింది. కొత్త ఏడాది సెలబ్రేషన్స్ లో విజయ్ వర్మకు లిప్ లాక్ ఇస్తూ కెమెరా కంటికి అడ్డంగా దొరికిపోయింది. ఇంకేముంది.. మాములుగానే రూమర్ అని క్రియేట్ చేసే నెటిజన్లు.. ఈ ఫోటో బయటపడడంతో అమ్మడికి ఎఫైర్ అంటగట్టేశారు. అంటగట్టడం అనేదానికన్నా అమ్మడు కావాలనే రివీల్ చేసింది అని చెప్పొచ్చు. ఈ జంట ప్రస్తుతం ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు.
ఇక విజయ్ వర్మ తెలుగువారికి కూడా సుపరిచితమే.. నాని హీరోగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి(MCA) సినిమాలో విలన్ గా నటించాడు. ప్రస్తుతం విజయ్ వర్మ బాలీవుడ్ లో విలన్ గా, సహాయ నటుడిగా నటిస్తూ మంచి గుర్తింపే తెచ్చుకుంటున్నాడు. ఈ జంట తమ వెకేషన్ ను పూర్తి చేసుకోని ముంబై కు వాస్తు ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఇక తమన్నా ప్రేమాయాణాన్ని అభిమానులు అంగీకరించలేకపోతున్నారు. ఇతను తప్ప వేరే మగాడే దొరకలేదా తమ్ము..? అని కొందరు.. అతనికి, తమన్నాకు అసలు సెట్ కాలేదని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ రూమర్స్ పై మిల్కీ బ్యూటీ ఏదైనా స్పందిస్తుందోమో చూడాలి.
