NTV Telugu Site icon

హీరోలని మార్చుకున్న శ్రుతి, తమన్నా…

టాలీవుడ్ హాట్ బ్యూటీస్ శ్రుతి హాసన్, తమన్నా భాటియా ఇద్దరూ అటు గ్లామతో ఇటు నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇక ఈ ఇద్దరి మధ్య చక్కటి అనుబంధం, స్నేహం కూడా ఉంది. తాజాగా ఈ బ్యూటీలు ఇద్దరు బడా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. శ్రుతి హాసన్ మలినేనిగోపిచంద్ దర్శకత్వంఓ బాలకృష్ణ నటిస్తున్న సినిమా సైన్ చేయగా, తమన్నా మెహర్ రమేశ్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’లో నటిస్తోంది. నిజానికి బాలకృష్ణ సరసన ముందు తమన్నాని అనుకున్నారట. అయితే పేమెంట్ విషయంలో అనుకున్న మొత్తం రాదని భావించిందో ఏమో తమన్నా ఆ ఆఫర్ ని వద్దన్నదట. ఇక అజిత్ వేదాళంలో శృతి హాసన్ కథానాయిక. ఆ సినిమా రీమేక్‌గా వస్తున్న ‘భోళా శంకర్’ కోసం మెగాస్టార్ ఆమెను పునరావృతం చేయాలని భావించారట. అయితే ఏమైందో ఏమో శ్రుతి చిరు చిత్రాన్ని కాదని బాలయ్య ప్రాజెక్ట్‌ని ఎంచుకుంది. ఇలా ఎక్సేంజ్ ప్రోగ్రాం అన్నట్లు శ్రుతి, తమన్నా ఇద్దరూ ఒకరికి వచ్చిన ఆఫర్ ని మరొకరు పంచుకున్నారన్నమాట. బాలకృష్ణతో శ్రుతి హాసన్ జోడీ కట్టడం ఇదే తొలిసారి కాగా చిరంజీవితో తమన్నా రెండోసారి కలసి నటిస్తోంది. ఇంతకు ముందు ‘సైరా’లోనూ గుర్తింపు ఉన్న పాత్రను పోషించింది తమన్నా. మరి హీరోలను మార్చుకున్న శ్రుతిహాసన్, తమన్నా ఆ యా హీరోలకు, సినిమాలకు ఏ మేరకు లబ్ది చేకూరుస్తారో చూడాలి.

Show comments