NTV Telugu Site icon

Talasani Srinivas Yadav : ఇండస్ట్రీకి పెద్ద దిక్కు మెగాస్టారే !

Chiranjeevi

Chiranjeevi

సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరనే విషయం గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవిని పెద్దన్నగా చెప్పుకుంటారు చాలామంది సినీ ప్రముఖులు. అయితే టాలీవుడ్ కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామాల వల్ల ‘నేను సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కాదు… కేవలం సినిమా బిడ్డ’ను మాత్రమే అంటూ చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చారు. అయితే ఎవరికి ఏ సమస్య వచ్చినా తప్పకుండా ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ఏపీలో టికెట్ రేట్ల విషయంలో చొరవ తీసుకుని, సమస్యను పరిష్కరించారు. అయితే తాజాగా జరిగిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ మెంబర్స్ హెల్త్ కార్డుల పంపిణీలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు మెగాస్టారేనని అన్నారు.

Read Also : Acharya : ఆగిన సినిమా… అభిమానుల ఆందోళన

ఈ కార్యక్రమంలో తలసానితో పాటు చిరంజీవి, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఇంకా తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు. అందులో భాగంగా తలసాని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు అసోసియేషన్ కు 5 లక్షల విరాళాన్ని కూడా ప్రకటించారు.