Site icon NTV Telugu

Rudramambapuram: హాట్ స్టార్ స్పెషల్ ‘రుద్రమాంబపురం’ మంత్రి తలసాని ప్రశంశలు

Rudramambapuram

Rudramambapuram

Talasani Congratulates Rudramambapuram Team: ఈ మధ్య కాలంలో కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో కంటెంట్ ను బేస్ చేసుకుని ఎన్‌వీఎల్ ఆర్ట్స్ బ్యానర్ పై నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం. మ‌హేష్ బంటు ద‌ర్శ‌కత్వం వహించిన ఈ సినిమాకు మూల కథ అజయ్ ఘోష్ అందించి ఆయనే కీలక పాత్రలో నటించడం గమనార్హం. ఇక శుభోద‌యం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన `రుద్ర‌మాంబ‌పురం హాట్ స్టార్ లో అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా యూనిట్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు.

LGM Trailer: పెళ్లి కోసం సాటి మగాడి తిప్పలే ‘ఎల్‌జీఎం’.. ఆసక్తికరంగా ట్రైల‌ర్

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు , ఆచారాలు, వారి కష్ట సుఖాల మీద వచ్చిన రుద్రమాంబపురం సినిమా బాగుందని అన్నారు. ఈ సినిమా యూనిట్ సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత నండూరి రాము మాట్లాడుతూ రుద్రమాంబపురం సినిమా డిస్నీ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతోందని, సినిమా చూసిన అందరూ బాగుంది అంటున్నారని అన్నారు. ప్రస్తుతం సినిమా హాట్ స్టార్ లో టాప్ లో ట్రేండింగ్ అవుతుందని, థియేటర్స్ లో రావాల్సిన సినిమా ఇదని అంటుంటే ఆనందంగా ఉందని అన్నారు. నటులు అజయ్ ఘోష్, రాజశేఖర్ పోటీ పడి నటించారని పేర్కొన్న ఆయన రుద్రమాంబపురం సినిమాకు రివ్యూ స్ కూడా బాగున్నాయని అన్నారు. త్వరలో మా NVL బ్యానర్ నుండి మరో సినిమాను అనౌన్స్ చెయ్యబోతున్నామని అన్నారు.

Exit mobile version