New Movie: ‘తలకోన’లో అందాల అప్సర రాణి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apsara Rani: మంత్ర ఎంటర్టైన్మెంట్ పతాకంపై సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో నగేష్ నారదాసి తెరకెక్కిస్తున్న సినిమా ‘తలకోన’. ఈ సినిమా షూటింగ్ గురువారం ప్రసాద్ లాబ్స్ లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ మూవీలో అందాల భామ అప్సర రాణి ప్రధాన పాత్రను పోషిస్తోంది. ముహూర్తపు సన్నివేశానికి ‘గుర్తుందా శీతాకాలం’ నిర్మాత రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా… ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ఈ సంద్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘తలకోన’ చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ, ”క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు, అందులో ఇంకో కోణం కూడా ఉంటుంది. అదే విధంగా పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడం జరుగుతుంది. ప్రధాన కథాంశం అయితే తలకోన ఫారెస్ట్ లోకి కొంతమంది స్నేహితులు వెళ్తారు. ఎంత మంది వెళ్లారు? ఎంతమంది తిరిగొచ్చారు? అనేదే ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాకుండా కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఈ చిత్రాన్ని 20 రోజులు హైదరాబాద్ లో, మరో 20 రోజులు తలకొనలో షూట్ చేయబోతున్నాం” అని అన్నారు.
హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ, ”మంచి స్క్రిప్ట్స్ కు నేను ఫ్యాన్ ను. అదే ఇప్పుడు ఈ ‘తలకోన’ చిత్రం చేయడానికి కారణం అయ్యింది. నేను మొదటి నుంచి కూడా మంచి స్క్రిప్ట్ ఉన్న కథలనే ఎంచుకుంటున్నాను. అవే నాకు మంచి పేరును కూడా తెచ్చిపెట్టాయి. అలాగే ఈ చిత్రం కూడా మంచి విజయంతో పాటు మంచి పేరును కూడా ఇస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి రెండు పాటల రికార్డింగ్ పూర్తయ్యిందని సంగీత దర్శకుడు సుభాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా, ప్రముఖ దర్శకుడు వేగేశ్న సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!